చిత్రం : అమ్మాయిలు-అబ్బాయిలు (2003)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి , గానం : చక్రి, కౌసల్య
పల్లవి :
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే (2)
నాతో నీవు ఉంటే ఆనందం నావెంటే
ఈరోజే మెరిసింది ఒక తారకా
నీ స్నేహం కోరింది మనసాగకా
హోయి హోయి హోయి
హోయి హోయి హోయి (2)
మళ్లీ మళ్లీ రాదు మనకోసం ఈ రోజు
చేయి కలిపి చూడు మధుమాసం ప్రతిరోజు
చరణం : 1
చెప్పనా నీ రూపమే ఎద చేరిందని
చెప్పకా ఇక తప్పదూ ఇది ప్రేమేనని
పరుగులు తీసే వయసులలోన
కోరిక తరుమునులే
ప్రేమని దానికి పేరుని పెడితే తప్పేనులే
మీకేం మగవారు తెగ మాటలు చెబుతారు
ఇంతా తెలిశాక ఇక చాలు చాలు మరి
చూపులెందుకని ॥॥
చరణం : 2
హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని
సాయమే చెలి కోరితే ఇటు రావేం మరి
ఇరువురి మనసులు కలవని ప్రేమ
ఎన్నడు గెలవదులే
చెదిరిన మదిలో చెలిమికి చోటే లేదందిలే
నిండా ప్రేముండి మీరెందుకు దాస్తారూ
అయ్యో అమ్మాయో ఇది ప్రేమకాదు
అని తెలుసుకోవె మరి ॥॥
05 June - నేడు భాస్కరభట్ల బర్త్‌డే