చిత్రం : బంగారుబాబు (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా ॥
చరణం : 1
పగలంతా ఇద్దరము ఆలుమగలము
పడుకునే వేళకు పక్కలే దూరము ॥
ఊరివారికందము ఉత్తుత్తి కాపురము (2)
నోరూరతున్న మనకేమో ఓపలేని తాపము ॥
చరణం : 2
అన్నివున్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా ॥
ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా (2)
కన్నెకున్న హద్దులకు కట్టుబడి ఊరుకున్నా ॥
చరణం : 3
కళ్లలోకి చూడకు కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్లు పడేవరకు మోమాట పెట్టకు ॥
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
కాచుకున్న వయసు కచ్చి అప్పుడే తీరును ॥
21 June - నేడు కె.వి.మహదేవన్ వర్ధంతి