చిత్రం : వంశవృక్షం (1980)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : బాలు, శైలజ, బృందం
పల్లవి :
వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా (2)
గోపవనితా హృదయ సరసీ
రాజహంస కృష్ణా కృష్ణా ॥॥
చరణం : 1
పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరంలో
నిలిచింది గీతా సారంలో ॥॥
చరణం : 2
ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది అంతా నీవేలే అన్నీ నీ లీలలే ॥॥
చరణం : 3
నోటిలో ధరణి చూపిన కృష్ణా
గోటితో గిరిని మోసిన కృష్ణా
ఆటగా రణము నడిపిన కృష్ణా (2)
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా (2)
కిలకిల మువ్వలకేళీ కృష్ణా
తకధిమి తకధిమి తాండవ కృష్ణా
కేళీ కృష్ణా తాండవ కృష్ణా (3)
Photo:కె.వి.మహదేవన్