Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : మాయాబజార్ (1957)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : మాధవపెద్ది సత్యం


అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన
శుంభధ్వజము గ్రాల చూడవలదె!
గగన పాతాళ లోకాలలోని సమస్త
భూత కోటులు నాకె మ్రొక్కవలదె!
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చార్యాల జరుగవలదె
హై హై ఘటోత్కచ... జైహే ఘటోత్కచ
అని దేవగురుడె కొండాడవలదె
ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని
కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!
-------------------
జై సత్యసంకల్ప జై శేషతల్పా!
జై దుష్టసంహార జై దీనకల్పా!
జై భక్త పరిపాల జై జగజ్జాలా!
నీవు జరిపించేటి నీ చిత్ర కథలు
వ్రాసినా చూసినా వినిన ఎల్లరును
శుభసంపదలు గలిగి వర్థిల్లగలరు
సుఖశాంతులను గలిగి శోభిల్లగలరు!

03 July - నేడు ఎస్.వి.రంగారావు జయంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |