Edo Edo vullasam - ఏదో ఏదో ఉల్లాసం
చిత్రం : వస్తాడు నా రాజు(vastADu nA rAju) (2010)రచన : రామజోగయ్యశాస్త్రి(rAmajOgayya SAstri)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : కార్తీక్, చైత్ర(kArteek,chaitra)
పల్లవి :
ఏదో ఏదో ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం
ఏదో ఏదో ఉల్లాసం నీలో నాలో ఒకే సంతోషం
నువ్వేమిటో నేడే నే తెలుసుకున్నానా
నీలావుండే నన్నే నే కలుసుకున్నవా
నీ నవ్వు దివ్వెలోన నే వెలుగుతున్నానా
నీ గుండె గొంతులోన నే పలుకుతున్నానా
ఎలో ఎలో ఎన్టీ డైలమా
నిన్నా మొన్న ఇలా లేదమ్మా
నీకూ నాకూ ఏంటవుతోందమ్మా
రానా అంటూ వచ్చేసిందా ప్రేమ॥ఏదో॥
చరణం : 1
ఏమో ఎటేల్లిందో మన నడుము ఉండే దూరం
ఎలా మొదలయిందో ఈ చిలిపి దుమారం
ఇదే ఇదేనేమో నే మనసుపడే లోకం
నీలో చూసిందేమో నా వయసు వసంతం
ఏ హాయి కలో పిలిచి
నిన్ను నన్నింతగా జంట నడిపి
తీపి కన్నీరు నాలో పొంగించిందేమో
ఏ గాలి అలో తరిమి
ఎద లోతుల్ని పువ్వై తడిమి
నింగి జాబిల్లి చెయ్యే అందించిందేమో
॥ఎలో॥
చరణం : 2
పదే పదే నువ్వే నా పెదవి ప్రపంచంలో
నిన్నే ఆలోచిస్తూ నన్ను మరిచిపోయానా
మరీ మరీ నువ్వే నా నిదురలో నిజంలో
మరో సగం నేనై నీలోన చేరానా
ఇన్నాళ్లు నాలో అసలు
చూడనేలేదు ఈ తికమకలు
కొంటె కన్నేదో నన్ను గిల్లే ఉంటుంది
ఏఁవిటో తెలీని గుబులు
ఇప్పుడయింది నాలో మొదలు
వింతగా ఉంది అయినా బావుంది
॥ఎలో॥