Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

ekkaDidAkA I naDaka - ఎక్కడిదాకా ఈ నడక


ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాక మౌనంలో మునక
ఓ ఎక్కడిదాకా ఈ నడక
ఎప్పటిదాక మౌనంలో మునక
నీకు తెలియక నాకు తెలియక
నీకు తెలియక నాకు తెలియక
ఎంతసేపు ఈ రెండు మనసులకు
తికమక ఈ తికమక

||ఎక్కడిదాకా ||

గుండె చప్పుడు వినిపించే నిశ్శబ్ధమిది
కలల రంగులు కనిపించే నిసీధి ఇది
హో గుండె చప్పుడు వినిపించే నిశ్శబ్ధమిది
కలల రంగులు కనిపించే నిసీధి ఇది
ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో
ఇలాంటి సమయంలో ఎలాగ పుట్టిందో
ఇద్దరిమధ్యన పేరు తెలియని ఈ బందం
ఓహొహో ఇప్పటికిప్పుడు వేరవ్వలేని
ఈ సంబంధం
||ఎక్కడిదాకా ||

మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది
రేపు సంగతి దాచుంచే రహస్యమిది
మొన్న నిన్నను మరిపించే ప్రయాణమిది
రేపు సంగతి దాచుంచే రహస్యమిది
మరింత ఆత్రంగా మనస్సు చూస్తుంది
మరింత ఆత్రంగా మనస్సు చూస్తుంది
ఏమౌతాదో చిగురు తొడిగిన పరిచయం
ఏం చేస్తాదో బయట పడకుంది ఈ కాలం

||ఎక్కడిదాకా||

Comments