చిత్రం : బద్రినాథ్ (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : జెస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్
పల్లవి :
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లే స్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్
నాథ్ నాథ్... నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్
కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కత్తి దూస్తే బద్రినాథ్ అంతుచూస్తే బద్రినాథ్
మదిలో మెరమెరమెరమంటూ
మెరిసే మెరుపే బద్రినాథ్
నాథ్ నాథ్... నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్‌పల్ పెరియార్
చరణం : 1
నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికీ గడిపేస్తా
నీపైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా
మిత్రుడివైనానువ్వే
నా ప్రియ శత్రువువైనా నువ్వే
ప్రేమికుడైనా నువ్వే
సోకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే ॥నాథ్॥
చరణం : 2
నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా
నీ గుండెలోని గదిలో నే దిగివుంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టం ఐనా నువ్వే కమ్మని కష్టం ఐనా నువ్వే
స్వర్గం ఐనా నువ్వే
నచ్చిన నరకం ఐనా నువ్వే నువ్వే ॥నాథ్॥