Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : వైశాలి (2011)
రచన : చైతన్యప్రసాద్
సంగీతం : ఎస్.థమన్, గానం : రంజిత్

సాకీ : కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా
తడిసే తడిసే మనసే తడిసే
లేరే లేరే ఎవరూ నాకు ఒంటరినే నేను
ఇకపై ఇకపై అన్నీ నువ్వే...

పల్లవి : కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా
ఎదనే ఎదనే తడిపిన వాన
రగిలే రగిలే మనసే రగిలే జ్వర మొచ్చిందేమో
తడిసి తడిసి ప్రేమలోనే ॥

అనుపల్లవి : మునుపే నేనే ఒక దీవై ఉన్నానే
సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే ॥

మౌనంగా మౌనంగా అన్నా
వెళిపోతూ వెళిపోతూ ఉన్నా

చరణం : నీ ఓణీ తగిలిందా ఒక జల్లే కురిసిందే
ముసిముసి నీ నవ్వుల్లో ఓ వరదగ మారిందే
నుదుటున కదిలే కురులే తామర బిందువువోలే
అది సరిచేసే లోపే ముత్యాలే రాలేనే
చాలులే చాల్లే ఇక నువ్వే వెళ్లిపో
ఊపిరే నాదే ఆగిపోయేలాగుందే ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |