Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : గులేబకావళి కథ (1962)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం :జోసెఫ్-వి.కృష్ణమూర్తి
గానం : ఘంటసాల


పల్లవి :
ఒంటరినైపోయాను
ఇక ఇంటికి ఏమనిపోనూ ॥

చరణం : 1
నాపై ఆశలు నిలుపుకున్న
నా తల్లి ఋణము చెల్లించనైతిని (2)
ఎవరికీ గాక ఏ దరిగానక (2)
చివికి చివికి నే మ్రోడైపోతిని ॥

చరణం : 2
నన్నే దైవమని నమ్ముకున్న
నా ఇల్లాలిని ఎడబాసితిని (2)
బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి (2)
ఈ బండలలో ఒక బండనైతిని ॥

చరణం : 3
వలచిన కన్యను వంచనజేసి
నలుగురిలో తలవంపులుజేసి (2)
గుండె ఆవిరైపోవుచుండ (2)
ఈ మొండి బ్రతుకు నేనీడ్చుచుంటిని ॥

Ontarinai Poyanu - Gulebakavali Katha - Telugu Old Classics - NTR | Ghantasala |
Youtube Videos


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |