చిత్రం : సర్వం (2010)
రచన : వెన్నెలకంటి
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : జావేద్ అలీ, మధుమిత
పల్లవి :
రెక్కలు వచ్చెను ఎగిరే ఎదకు
దిక్కులు కలిసెను చెలిమి కొరకు
చుక్కల చూపులు నిన్నే చూడగా
తనువే పొంగెను ఎగిసే కలగా
మనసే దూకెను ఉరికే అలగా
కొసరే కోరిక నిన్నే వెతకగా
కోరికోరి నిన్నెచేరా కొంతకాలం
కొంత దూరం కొంత విరహం
ఓర్చుకుందీ హృదయం
నిన్ను నేనే వెతుకు వేళ ఇదే లక్ష్యం ఇదే బాట
ఇదే పయనం ఇదే బతుకూ అయ్యెనూ
కనులే పొంగెను ఎగిసే కలగా
వయసే దూకెను ఉరికే అలగా
కొసరే కోరిక నిన్నే వెతకగా
చరణం : 1
ఓ కదిలే నది కెరటం కోసం తీరం కాచుకున్నది
కాసే సిరి వెన్నెల కోసం భూమి వేచియున్నది
ఓ మావిచాటు కోయిల గీతం
స్వరమెవరికి తెలుసు
కనుపాపల రాగం పలికే కలలెవరికి తెలుసు
చెలియా నే నిన్ను చేరగా
వచ్చా తీపి దాహం తీరగా
ఉన్నా నీ అడుగుజాడగా
నీతో తోడై వచ్చు నీడగా
నాదు హృదయం ఎక్కడుందీ పూవులోన నింగిపైన అగ్నిలోన గాలిపైన లేదులే
నీదు కన్నై నీదు ముద్దై నీదు రేయై నీదు హాయై నీదు ఆశై నీదు ఎదలో ఉందిలే
చరణం : 2
ఓ నాకే నే బరువైపోయి నన్ను మోసుకొచ్చానే
నీకే నే నీడగ మారి నిన్ను వెతుకుతున్నానే
కనుల నీరు జారే వేళ రెప్పవేళ లేదు
తనువునొదిలి ఏనాడైనా మనసు వెళ్లిపోదు
కాలం నాకై ఆగిపోయెనే
లోకం నాతో కలిసి సాగెనే
శోకం ఒక శ్లోకమాయెనే
సుఖమో బాధో హద్దు మీరెనే ॥
ఒక రెప్పేమో తేనైపోయే
ఒక రెప్పేమో చేదైపోయే
రెంటికి మధ్యన కలలే సాధ్యమా ॥కోరి॥