Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమికులరోజు (1999)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్,
గానం : ఉన్నికృష్ణన్


పల్లవి :
రోజా... రోజా...
రోజా రోజా రోజా రోజా (4)
నిన్ను చూసి నన్ను నేను
మరచిపోయి తిరిగి వచ్చా
నిను గాలిసోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే
నే ఓర్వనులే నే ఓర్వనులే
రోజా రోజా రోజా రోజా...

చరణం : 1
కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని
నడుముకు కలుగును గిలిగిలి నా రోజా
నీ పేరు నా నోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం
కనులే రెండు హృదయమే ఒకటి
రోజా రోజా రోజా ॥

చరణం : 2
నవ యువతి నడుమొక గ్రంథము
చదివైనా పలుచని రాత్రులు మంచులో
దూరాలేలా జవరాలా బిడియాన్ని
ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని
గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని
చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువు చేరగా ఎందుకాలోచనా
నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు
నా రోజా రోజా రోజా ॥

09 July - నేడు ఉన్నికృష్ణన్ బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |