పల్లవి :
తారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి
ఒక పాట పాడాలి (2)
॥
చరణం : 1
ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా
కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా
॥
నిలిచి పొమ్మనీ మబ్బుగా
కురిసి పొమ్మనీ వానగా
విరిసి పొమ్మనీ వెన్నెలగా
మిగిలి పొమ్మనీ నా గుండెగా (2)
॥॥
చరణం : 2
నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా
॥
చెప్పి పొమ్మనీ మాటగా
చేసి పొమ్మనీ బాసగా
చూపి పొమ్మనీ బాటగా
ఇచ్చి పొమ్మనీ ముద్దుగా (2)
॥॥
చిత్రం : ప్రేమాభిషేక ం (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు