చిత్రం : దసరా బుల్లోడు (1971)
రచన : ఆచార్య ఆత్రేయ,
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందె చిన్నమ్మీ (2)
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగె ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ (2)
చరణం :1
మొలలోతు నీళ్లల్లో మొగ్గల్లె నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్లూ మెరుస్తుంటే॥
పొదచాటున నేను మాటేసి చూస్తుంటే
నువ్వు తానాలు ఆడావు ఓలమ్మీ
నా ప్రాణాలు తీశావె చిన్నమ్మీ ॥॥
చరణం :2
మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటొకటె చూశాను ॥
జడచూస్తి ఆ... మెడచూస్తి ఆహా...
జబ్బల నునుపు చూస్తి హా...
కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ
కసికసిగా చూస్తినే చిన్నమ్మీ ॥॥
చరణం :3
తడిసీ నీ తెల్లకోక తపాతపామన్నది
తడబడి నా గడుసు మనసు దడాదడామన్నది॥
కళ్లు మూసికొస్తినని
ఘొల్లున నువ్వు నవ్వితే ఆహ్హహ్హా
చురకల్లె తగిలింది ఓలమ్మీ
ఉడుకెక్కిపోయిందే చిన్నమ్మీ॥॥
03 Agugust - నేడు వాణిశ్రీ బర్త్‌డే