Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అందమైన అనుభవం (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు వెర్రెక్కి ఉన్నోళ్లు
కళ్లాలే లేనోళ్లు కవ్వించే సోగ్గాళ్లు ॥
ఆటగాళ్లు పాటగాళ్లు అందమైన వేటగాళ్లు
హద్దులేవి లేనివాళ్లు ఆవేశం ఉన్నవాళ్లు
రారారరీ... ఓ...॥

చరణం : 1
గతమును పూడ్చేది వీళ్లు
చరితను మార్చేది వీళ్లు
కథలై నిలిచేది వీళ్లు కళలకు పందిళ్లు వీళ్లు
వీళ్లేనోయ్ నేటి మొనగాళ్లు...
చెలిమికెపుడు జతగాళ్లు
చెడుకు ఎపుడు పగవాళ్లు
వీళ్ల వయసు నూరేళ్లు నూరేళ్లకు కుర్రాళ్లు ॥

చరణం : 2
తళతళ మెరిసేటి కళ్లు నిగనిగలాడేటి ఒళ్లు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్లు...
నిదురరాని పొదరిళ్లు బ్రహ్మచారి పడకిళ్లు
మూసివున్న వాకిళ్లు తెరచినప్పుడె తిరునాళ్లు ॥

చరణం : 3
నీతులు చెప్పే ముసలాళ్లు
నిన్నా మొన్నటి కుర్రాళ్లు
దులిపేయ్ ఆనాటి బూజులు
మనవే ముందున్న రోజులు
తెంచేసేయ్ పాత సంకెళ్లు...
మనుషులే మన నేస్తాలు
మనసులే మన కోవెల్లు (2)
మనకు మనమే దేవుళ్లు మార్చి రాయి శాస్త్రాలు ॥॥

Photo: ఎం.ఎస్.విశ్వనాథన్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |