Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అంతస్తులు (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము ॥
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసు కోసము
మనసులోని చల్లని మమత కోసము ॥

చరణం : 1
దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము
దాపరికం ఎరుగని మనిషి కోసము ॥
దాగనీ యవ్వనం ఎవరి కోసము
దాచుకొని ఏలుకునే ప్రియుని కోసము ॥

చరణం : 2
పొద్దంత కలవరింత ఎవరి కోసము
నిద్దురైన రానీని నీ కోసము ॥
అద్దాల చెక్కిళ్ళు ఎవరి కోసము
ముద్దైన నీ మోవి ముద్ర కోసము ॥

చరణం : 3
నింగి నేల కలసినది ఎవరికోసము
నీవు నన్ను చేరదీసినందుకోసము ॥
నేల మీద ఒక్కరై సాగిపోదము
నింగిలోన చుక్కలై నిలిచిపోదము ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |