Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : వరలక్ష్మీ వ్రతం (1971)
రచన : జి.కృష్ణమూర్తి, సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : జానకి, లీల, పి.బి.శ్రీనివాస్ బృందం


పల్లవి :
వరమహాలక్ష్మీ కరుణించవమ్మా (2)
చరణాలే శరణంటినమ్మా...
పతిదేవు బాసితి వెతలంది రోసితి
నుతియింతు పతినీయవమ్మా
వరమహాలక్ష్మీ వరమీయవమ్మా
మాం పాహి మాతా... మాం పాహి మాతా...
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

చరణం : 1
పాలకడలిన పుట్టి శ్రీహరిని చేపట్టి
వైకుంఠలోకాన లక్ష్మివైనావే
మాం పాహి మాతా... మాం పాహి మాతా...
సత్వగుణమూర్తివే ఆ... సంపత్స్వరూపివే ఆ...
సత్వగుణమూర్తివే... సంపత్స్వరూపివే...
సర్వసిద్ధివి నీవే సుమ్మా
నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా
॥పాహి మాతా॥

చరణం : 2
వాగీశు రాణివై వరవీణపాణివై
బ్రహ్మలోకమ్మున వాణివైనావే
మాం పాహి మాతా... మాం పాహి మాతా...
కల్యాణదాయిని కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు తల్లివీవమ్మా
॥వేదనను॥॥పాహి మాతా॥

చరణం : 3
గిరిరాజ తనయవై పరమేశు తరుణివై
కైలాసలోకాన గౌరివైనావే
మాం పాహి మాతా... మాం పాహి మాతా...
శక్తిస్వరూపిణి మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా (2)
సుఖసౌఖ్య సౌభాగ్యదాయివీవమ్మా
॥వేదనను॥॥పాహి మాతా॥
పతినీయవమ్మా... (3)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |