Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : చంద్రముఖి (2005)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : విద్యాసాగర్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
అత్తిందోం తింధియం
తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం
తొందానా దిందాది నుందోం

అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా
ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం
వినుకోవే బొమ్మా
ఆ పాట కనరాని చోటు
ఏడుందే బొమ్మా
ఈ పాట ఇచ్చింది కూడ
ఈశుడే బొమ్మా
ముక్కంటి పాదాలు నేను
ముద్దుపెట్టానే
ముద్దుగా ప్రజల గుండెల్లో
నన్ను పెట్టాడే

చరణం : 1
వాగు వంక పొంగే వానాకాలంలోన
వింటావమ్మా నది పాట ఓ నది పాట
మల్లే మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే
కట్టిదంమ్మా వని పాట ఓ వని పాట
ఏయ్... చిందులు వేయించే పాట
కనువిందులు కావించే పాట
గుండె సంధించే పాట
ఆ దివిని అందించే పాట
నా పాట సవ్వడి వింటూ
తిరిగే భూమి ఎల్లప్పుడూ

చరణం : 2
చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ జోల
లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం
ఆలుమగలు గుట్టుగ చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం
హే... లోకమంటే వింత
అది తెలియకుంటే చింత
నువ్వు నేను అంతా
ఆ దేవుని ముందు ఎంత
అరె అన్నీ తెలిసినవాడు
ఎవడూ లేనేలేడమ్మా

చిత్రం : యముడు (2010)
రచన : శశాంక్ వెన్నెలకంటి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సుచిత్రా కార్తీక్ కుమార్, సాగర్

పల్లవి :
నా హృదయం ఎరుగదు ఇది వరకు
ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇది వరకు
ఈ కసి గుసగుసలే
ఇది ఏదో ఏమో ఎరుగనులే
అయినా మధురములే
ఇది కలయా నిజమా తెలియదులే
కొంచెం కలయై కొంచెం నిజమై
ఊయలూపే ఎదనే
హృదయం....

చరణం : 1
ఎక్కడో నువ్వున్నా పక్కనే ఉన్నట్టుంది
ఎప్పుడూ నిన్నొదిలీ
మనసిలా రానంటుంది
ఎందుకో ప్రతిమాటా
నీ పేరులా వినబడుతోంది
అందుకే సగవాటా
నీ పేరులో మనసడిగింది
దాహమే రేపినా మోహమే నీవులే
తీయనీ వీణలా గుండెల్లో మోగావులే
హృదయం...

చరణం : 2
యవ్వనం నీకోసం
నేర్చెలే వయ్యారాలు
ఈ క్షణం నా ప్రాయం
పేర్చెలే పూబాణాలు
కంటిలో కాటుకలా
కరిగినా నా స్వప్నాలే
గంటకో కోరికలా చేరనీ నీ కౌగిళ్లే
బొత్తిగా మరచినా పడకలో నిద్దురా
ముద్దుకే మనసిలా
పడుతుందిలే తొందరా
హృదయం.....

చిత్రం : ధర్మచక్రం (1996)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
సొగసు చూడ హాయి హాయిలే
తెలిసె నేడు ఇంత హాయి...
హాయి... హాయి
చెలియ చూపు నీకు హాయిలే
చెలిమిలోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానె ఆశ తీరునా
అహో ఇదెంత వింత మోహమో

చరణం : 1
నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు
నీవెంట నేనుండనా
నీ నవ్వే ముద్దంటు
ఇంకేమి వద్దంటు ముడిపడనా
నీకోసం పుట్టాను నీ దారే పట్టాను
నీమీదే ఒట్టేయనా
నా చేత చేయ్యెట్టు
నన్నిట్టా జోకొట్టు ఒడిలోన
చెట్టా పట్టా కట్టేదెట్టో
ఇట్టే చెప్పేయాలమ్మా
చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా
కుమారి చెంపకెన్ని కెంపులో
వరించు కళ్లకెన్ని రంగులో
అహో ఇదెంత వింత మోహమో

చరణం : 2
నా పాలబుగ్గల్లో దీపాల సిగ్గుల్లో
నీపాలు పంచివ్వనా
ఈ వెండి వెన్నెల్లో
నీ గుండె చప్పుళ్లు వినలేనా
హద్దుల్ని దాటాలి వద్దన్న చూడాలి
నీ కన్నె కవ్వింపులు
కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి
పదనిసలు
నిన్న మొన్న లేనేలేని
వైనం ఎంతో బాగుంది
వన్నె చిన్నె ఊరించాకే ప్రాణం లాగింది
సయ్యాటలాడ ఎంత తొందరో
వయ్యారి ఈడుకెన్ని చిందులో
సుఖాల తీరమెంత దూరమో