Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : బావ బావమరిది (1993)
రచన : వేటూరి
సంగీతం : రాజ్-కోటి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
గజ్జె ఘల్లుమన్నదో
గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడే తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార
కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది
నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో
॥ఘల్లు॥

చరణం : 1
ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే
సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను
వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను
సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను
ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న
వడ్డాణమూ గంటకొట్టే కౌగిళ్ళలోనా
మువ్వగోపాల రమ్మంది
ముద్దిచ్చి పొమ్మంది మువ్వెక్కడో
జివ్వుజివ్వంటు నా గువ్వ
గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో
॥ఘల్లు॥

చరణం : 2
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను
నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లో చీ పో లు రేగేను
నా పూల సంతల్లో
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను
నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను
నీ వాలుచూపుల్లో
పంచదార పందిళ్లలో మంచు
తేనె సందిళ్లలో
పాలు పంచుకోరాదా ప్రాయం
వంగతోటెంతో బాగుంది
వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి
వేడెక్కిపో వేధించుకో వేటాడుకో
॥ఘల్లు॥

పల్లవి :
నీ పదములె చాలు రామా!
నీ పద ధూళులే పదివేలు
॥పదములె॥

చరణం : 1
నీ పద మంటిన పాదుకులు
మమ్మాదుకొని ఈ జగమేలు
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ
దానిని నడిపే తండ్రివి నీవా
॥పదములె॥

చరణం : 2
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నినుగానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను
॥పదములె॥

చిత్రం : బంగారు పంజరం (1969)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు-బి.గోపాలం
గానం : ఎ.పి.కోమల

పల్లవి : నాగమల్లివో తీగమల్లివో
నీవే రాజకుమారి (2)
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొకసారి నవ్వవె చంద్రచకోరి
నాగమల్లినో తీగమల్లినో
నీదే రాజకుమారి (2)
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి
ముద్దుల మోహన మురళి


చరణం : 1
వీణల్లే పాడు జాణల్లే ఆడు రసధునివై
నీవు నాలోన ఊగాలి రాగడోల
నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవేళ
నువ్వే నా రాసలీల
మేను వేణువై నిలువరించగా
అణిగిన అందెల సందడిలో
ఆ... రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి
ముద్దుల మోహన మురళి


చరణం : 2
నువ్వే నా ఈడు నవ్వే నాతోడు కలిసిన
కాపురమీవేళ కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంథాలు
చదివినవాడను ఈ వేళ
నువ్వే నా కావ్యమాల
పువ్వు పువ్వునా పులకరింతలే
కురిసెను మన చిరునవ్వులలో
నీవే రాజకుమారి... నీదే రాజకుమారి నీవే రాజకుమారి... నీదే రాజకుమారి

చిత్రం : నాగమల్లి (1980)
రచన : వేటూరి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల