Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
అరె! ఏమైందీ... అరె! ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ...
తన మనిషిని వెదుకుతు
ఇక్కడొచ్చి వాలింది
కలగాని... కల ఏదో...
కళ్లెదటే నిలిచింది
అది నీలో మమతను
నిద్దుర లేపింది... ఆ ఆ ఆ... ॥

చరణం : 1
నింగి వంగి నేలతోటి
నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం
పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు
పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు
నింగిైవె పు చూపులేదు
కన్నెపిల్ల కళ్లలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావే... ఓ...

చరణం : 2
బీడులోన వాన చినుకు
పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన
పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు
గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే
పాట నీవె రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు
వీడు మారిపోతాడు
మనిషౌతాడు... ॥

చిత్రం : ఆరాధన (1987)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
పది మందిలో పాట పాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూచినా
గుడికి చేరేది నూటికి ఒకటే
॥మందిలో॥

చరణం : 1
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కడే
॥మందిలో॥

చరణం : 2
ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను
వేడుక చేసే వసంతమొక్కటే

నా కన్నులందు ఎన్ని
వేల కాంతులున్నను
ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే
॥మందిలో॥

చిత్రం : ఆనంద నిలయం (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల

పల్లవి :
ఆ... ఆ... ఆ...
తళతళా మిలమిలా (2)
పగటిపూట వెన్నెలా... ఆ...
ఎందువలన ఓ లలనా ఎందువలన ఎందువలన ఓ లలనా ఎందువలన

చరణం : 1
చిలకమ్మల కిలకిల చిగురాకుల కలకల

గాలి వీచి పూలు కురిసి
కథలు తెలిపె కోయిల
తెలియరాని ఊహలలో తేలిపోవు వేళ
చిలిపిగా పావురాలు చూసి నవ్వెనేల

చరణం : 2
మురిసిపోవు మనసులోని
మధురభావన
మరుపురాని మరువలేని ఎవరిదీవెన
చిన్ననాటి మా చెలిమి
చిగురించెను నేటికి
మనసు పయనమైనది
మధురమైన చోటుకి


చిత్రం : అన్నపూర్ణ (1960)
రచన : ఆరుద్ర
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : పి.సుశీల