Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
ఉయ్యాల జంపాలలూగ రావయా (2)
తులలేని భోగాల తూగి...

చరణం : 1
తాతయ్య సిరులెల్ల వేగరప్పింప
జాగులో పుట్టిన బాబు నీవయ్యా (2)


చరణం : 2
మా మనోరమక్కాయి
మదిలోన మెరసి
ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి
ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి నా వారసుడావంతు నవ్వు రా కలసి నా వారసుడావంతు నవ్వు రా కలసి

చరణం : 3
మా మదిలో కోర్కెలను
మన్నింప దయతో
అవతరించినావయ్యా అందాలరాశి
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష (2)
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష (2)


చిత్రం : చక్రపాణి (1954)
రచన : రావూరి సత్యనారాయణరావు
సంగీతం, గానం : భానుమతి

పల్లవి :
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి (2)
మనసులు విరబూసి
మధువులు చిందాలి

చరణం : 1
పురాణాలు వేదాలు
రామాయణ భారతాలు (2)
కథలెన్నీ వర్ణించినా
హితమెంత బోధించినా
దోషిని దండించమని
ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి
మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి...
పరోపకారం పుణ్యం
పరహింసనమే పాపం (2)

చరణం : 2
విభేదాలు వైరాలు
కులమత విద్రోహాలు (2)
వివరించే నీతి ఒక్కటే...
సూచించే సూత్రమొక్కటే...
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
॥॥
చిత్రం : హైహై నాయకా (1989)
(దర్శకత్వం : జంధ్యాల)
రచన : ముళ్ళపూడి శాస్ర్తి
సంగీతం : సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
గానం : బాలు, మంజునాథ్

పల్లవి : హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది
అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే
చిలిపి వ యసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ... ఓ... ఓ... ॥

చరణం : 1 తెలియకడుగుతున్నాలే
కంప్యూటరేమంటోంది
పాఠమెంత అవుతున్నా
ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్
బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే
ఎదురే చూస్తోంది
ప్రేమకథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి
అనుభవాలసారమే
శాసనాలు కావు నీకు
సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
॥హ్యాపి॥
చరణం : 2 నింగిలోని చుక్కలనే
చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురేలేదనమా
నేల విడిచి సామైతే
టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే
విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తే ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే
పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ
లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
॥హ్యాపి॥

చిత్రం : సుస్వాగతం (1998)
రచన : సామవేదం షణ్ముఖశర్మ
సంగీతం : ఎస్.ఎ.రాజ్కుమార్
గానం : మనో, జయచంద్రన్, మణికిరణ్