Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
కొంత కాలం కొంత కాలం
కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం
రేపు కూడ రావాలి
(కొంత కాలం)
ఎంత కాలంమెంత కాలం
హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం
ఈడు నిద్దరాపాలి
కొంత కాలం

చరణం : 1
గుండె విరహములో మండే వేసవిలో
నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి
నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం
మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలి కాలం
కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలికాలం
మన కాలం ఇది... ఆ...
(కొంత కాలం)
చరణం : 2
కన్నె మోజులకు సన్నజాజులకు
కరిగే జాము కాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు
వచ్చే ప్రేమకాలం
తమి తీరకుండు తడి కాలం
క్షణమాగనంది ఒడి కాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలి కాలం
మరి సిరికాలం మగసిరి కాలం
మన కాలం పదా... ఆ...
(కొంత కాలం)

చిత్రం : చంద్రముఖి (2005)
రచన : వెన్నెలకంటి
సంగీతం : విద్యాసాగర్
గానం : సుజాత, యదు బాలకృష్ణ

పల్లవి :
రాయలసీమ మురిసిపడేలా...
రాగలవాడి జన్మ తరించేలా...
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి

చరణం : 1
పలికే పలుకుల్ల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన
జాబిలి తునకే
(తెలుగమ్మాయి)

చరణం : 2
గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు
చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
గుండెనే కుంచెగా మలచిందోయి
(తెలుగమ్మాయి)

చిత్రం : మర్యాదరామన్న (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎం.ఎం.కీరవాణి, గీతామాధురి

పల్లవి :
ఏయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు...
ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా...
వచ్చిందా మేఘం... రానీ
పుట్టిందా వేడి... పోనీ
తెచ్చిందా జల్లు... తేనీ మనమేం చేస్తాం
వచ్చిందా దారి... రానీ
అదిపోయే చోటికి... పోనీ
మలుపొస్తే మారదు... దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
॥విను॥
మనమేం చేస్తాం... మనమేం చేస్తాం... (2)

చరణం : 1
రాళ్లను కూడా పూజిస్తారు
అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారప్పొగునా చుట్టినా
పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే
అర్థం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్
సరేలే నీకు నాకు ఎవరున్నారు
॥విను॥॥

చరణం : 2
కడలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పూవుల్లో దాచిందెవరో పులకించేటి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడ లో
నేల మీద సాగుతాయి
ఈ నీడలా చీకటి పడినా
ఆ జాడలో చెరిగిపోవాయి
॥ఏయ్‌॥॥విను॥
ఓ ప్రియా ప్రియా... ఓ ప్రియా ప్రియా... (2)

చిత్రం : యువ (2004)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : అద్నాన్ సమీ, సుజాత