Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి : వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు ॥
అనుపల్లవి :
పెద్దలంత పిల్లలుగా మారే రోజు (2)
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు ॥
దీపావళి రోజు... దీపావళి రోజు...॥

చరణం : 1
చంటిపాప నవ్వులకు
పువ్వులు విరిసే రోజు (2)
మింటనున్న తారకలు
ఇంటింట వెలిగే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే
॥॥

చరణం : 2
జీవితం క్షణికమని
చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని
తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం
ముప్పుతెచ్చి పెడుతుందని (2)
తానందుకు సాక్ష్యమని
టపాకాయ చె బుతుంది
॥॥
చిత్రం : రామయ్య తండ్రి (1975)
రచన : మల్లెమాల
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
శీత వేళ రానీయకు... రానీయకు
శిశిరానికి చోటీయకు... చోటీయకు
వేళ...
ఎద లోపల పూలకారు
ఏనాటికీ... పోనీయకు...
వేళ...

చరణం : 1
ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదిరి పోవకు
అదిరి పోవకు...
ఒక్కుమ్మడిగా వర్షామేఘం
వెక్కివెక్కి రోదించినా
లెక్క చేయకు... లెక్క చేయకు...
వేళ....

చరణం : 2
చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కెపైక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో
మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను
నీ లోకం నిలుపుకో
వేళ...

చరణం : 3
ఉదయాన కలత నిదర చెదిరిపోవువేళ
మబ్బులలో ప్రతి తారక
మాయమయే వేళ
ముసలి తనపుటడుగుల
సడి ముంగిట వినబడేనా (2)
వీట లేడనీ చెప్పించు
వీలు కాదనీ పంపించు
వేళ...

చిత్రం : మేఘసందేశం (1982)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : పి.సుశీల, కె.జె.ఏసుదాస్


30/09/2010 - దేవులపల్లి కృష్ణశాస్ర్తి జయంతి

పల్లవి :
బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
బంగారు.....
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే
గుండె ఝల్లుమన్నాదే
బంగారు.....

చరణం : 1
నీలో చింతచిగురు పులుపున్నదే
బుల్‌బుల్ పిట్ట మల్‌మల్ మట్ట
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
తళుకుల గుట్ట మెరుపుల తట్ట
నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్లుమూసి చీకటి ఉందంటే
వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన
వెలుగై నిలిచి ఉంటుందే
బంగారు.....

చరణం : 2
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరిసిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల మువ్వా ముసిముసి నవ్వా
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపే కోసమే
హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో
కాలం మాయమరాఠీ
బంగారు......

చిత్రం : మురారి (2001)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, బృందం