Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒక టే రాగం
అది ఆనందభైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం
మది ఆనందభైరవి రాగం

చరణం : 1
కులికే మువ్వల అలికిడి వింటే
కళలే నిద్దుర లేచే (2)
మనసే ముర ళి ఆలాపనలో
మధురానగరిగ తోచే
యమునా నదిలా పొంగినది
స్వరమే వరమై సంగమమై

చరణం : 2
ఎవరీ గోపిక పదలయ వింటే
ఎదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో ఉంటే
ప్రణయాలాపన సాగే
హృదయం లయమై పోయినదీ
లయలే ప్రియమై జీవితమై

చిత్రం : ఆనందభైరవి (1984)
రచన : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే ఋజువేమో
ఏం చేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా
ఎవ్వరే ఆ జాబిలి (2)

చరణం : 1
ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే
తన జంట కలసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా
ఆమెతో ఈ సంగతి
చరణం : 2
ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటిచూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలే దెలా
చెప్పమ్మా కలవరమా
ఆమెతోనే అలజడి

చిత్రం : నీ స్నేహం (2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : రాజేష్, ఉష

ఆలాపన :
గురుబ్రహ్మ ఆ... గురుర్విష్ణుః ఆ...
గురుదేవో ఆ... మహేశ్వరః ఆ...
గురు సాక్షాత్పరబ్రహ్మ (2)
తస్మైశ్రీ గురవేనమః
ఓం నమో నమో నమఃశివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమఃశివాయ
ఓం నమో నమో నమఃశివాయ
శూలినే నమో నమః కపాలినే నమఃశివాయ
పాలినే విరంచి తుండ మాలినే నమఃశివాయ
పల్లవి : అందెల రవమిది పదములదా ఆ... (2)
అంబరమంటిన హృదయముదా...॥
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా...
సాగిన సాధన సార్థకమందగ
యోగ బలముగా యాగ ఫలముగా (2)
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
అందెల రవమిది పదములదా ఆ...

చరణం : 1
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై ॥
మేను హర్ష వర్ష మేఘమై... ఆ...
వేణి విసురు వాయు వేగమై... ఆ..
అంగ భంగిమలు గంగపొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే రీల రసఝరులు జాలువారేలా
జంగమమై జడమాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన
పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా ఆ...

చరణం : 2
నయన తేజమే... ‘న’కారమై ఆ...
మనో నిశ్చయం... ‘మ’కారమై ఆ...
శ్వాస చలనమే... ‘శి’కారమై ఆ...
వాంఛితార్థమే... ‘వ’ కారమై ఆ...
యోచన సకలము... ‘య’ కారమై ఆ...
నాదం ‘న’కారం మంత్రం ‘మ’కారం
స్తోత్రం ‘శి’కారం వేదం ‘వ’కారం
యజ్ఞం ‘య’కారం ఓం నమఃశ్శివాయ...
భావమె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణ పంచకమె పంచాక్షరిగా
పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై
పది దిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా ॥

చిత్రం : స్వర్ణకమలం (1988)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, వాణీజయరాం, బృందం