Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :ఛల్ ఛయ్య ఛయ్య ఛ య్యా ఛయ్యా
ఛల్ ఛయ్య ఛయ్యా ఛ య్యా ఛయ్యా
ఛయ్య ఛయ్యా ఛ య్యా ఛయ్యా ॥

చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్య
మది చెదిరి కథాకళి చెయ్య ॥

చరణం : 1
ఓ కన్నియపై చూపున్నదయా
ఎదుటపడే చొరవుండదయా
మనసాప లేక మాటాడ లేక
ఒక ఖయ్యామై తయారయ్యా ॥

చరణం : 2
గుమ్మంటు గుబాళిస్తున్నదయా
ప్రతిచోట తనే అంటున్నదయా ॥
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా (2) ॥
తొలగేనా మరీ ఈ మాయ తెర
తన చెలిమి సిరి నా కలిమి అని
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి (4)
జాలి పడైనా ఆ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమపడిన ఫలితమై
నావెపై వస్తూ ఉన్నదయా
చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య (2) ॥

చరణం : 3
మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయ
పరువాల తరంగమె తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా (2)
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరిమాని (2)
చెప్పరయ్య నా జాణ తోటి
తన జంటపడే దారేదయ్యా ॥

చిత్రం : ప్రేమతో (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సుఖ్వీందర్ సింగ్, శుభ

పల్లవి :
శ్వాసై స్వరమై...
సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా... వెలుగై రా...
నిజమయ్యే కలవై రా...
నడిపించే అడుగై రా...
నను చేరీ నాతో రా...
స్వరమై...

చరణం :
వయసే నిన్నే వలచి
వసంతమున కోకిలై తీయంగ కూసి
ఈ శిశిరంలోనా మూగబోయిన
నిన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమో ఉందో
చిగురించే... క్షణమే...
వెంటనే రా... వెలుగై రా...
నిజమయ్యే కలవై రా...
నడిపించే అడుగై రా...
నను చేరీ నాతో రా...

చిత్రం : ఏమాయ చేసావె (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : కార్తీక్

పల్లవి :
సోనియా... సోనియా... (2)
సోనియా సోనియా
స్వీటు స్వీటు సోనియా
రేగుతోందె లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్‌టైమ్స్ నీటే స్వీటు...
సమ్‌టైమ్స్ నాటే రైటు...
పిల్లా కళ్లను చూసే చేసెయ్
గురువా ఫైటు...

చరణం : 1
పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే చిరు
ముద్దులు పెట్టి శ్రుతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించేయాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటే ఉందే
మత్తెక్కె కౌగిట్లో ముంచెస్తా అమ్మడు

చరణం : 2
ఊరించే ఒడిలో ఉప్పొంగె తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపు కళ్లల్లో
మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్‌కి సిస్టమ్ లేదే
అంపైరు లేదే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నా చూపు తనమేగా

చిత్రం : రక్షకుడు (1998)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఉన్నికృష్ణన్, ఉదిత్, హరిణి