Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

సాకీ :
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా...
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ..
జోజో జోజో... జోజో జోజో...
పల్లవి :
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర ॥
జోజో జోజో... జోజో జోజో...

చరణం : 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా
అందుకే... ॥

చరణం : 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్‌మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్‌వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా
అందుకే... ॥

చరణం : 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా... ॥
జోజో జోజో... జోజో జోజో...
టాటా టాటా... టాటా టాటా...

చిత్రం : అందాల రాముడు (1973)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : వి.రామకృష్ణ

పల్లవి :
పిలిచిన పలుకవు ఓ జవరాలా (2)
చిలిపిగ ననుచేర రావా! రావా!
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయుడు చూసే వేళ (2)
చెలియను కవ్వించు వేలాయేలా
కలువల రాయుడు చూసే వేళ
చరణం : 1
చల్లగ విరిసే నీ చిరునవ్వులు (2)
మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు (2)
తొందర చేసెను నీలోన ॥

చరణం : 2
జగములనేల సొగసే నీదని (2)
గగనములో దాగే నెలఱేడు
మనసున దోచే మరుడవు నీవని (2)
కనుగొంటినిలే ఈనాడు
॥॥
పిలిచిన పలుకవు ఓ జవరాలా

చిత్రం : పిడుగు రాముడు (1966)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, పి.సుశీల

పల్లవి :
ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈవేళ
ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

హాయ్ రామా ఇదేమి ప్రేమ
హంగామా వరించ తరమా
అందమ్మా అయోమయంగా
ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ
॥రామా॥

చరణం : 1
ఏచోటా నా పాదం నిలబడనంటుంది
ప్రతిబాట నీవైపే పదపద అంటోంది
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది
అది కూడా చిత్రంగా బాగానే ఉంది
ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం
తప్పుకొనే దారేదో వెతకాలి ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో
ననులాగే ప్రియస్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో
చెబుతుందా ఈక్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెల
ఏఁప్రేమో మతే చెడంగా
చిక్కామొ అమాయకంగా
గుండెల్లో అదో రకంగా
చిందరవందర తొందర తికమక


చరణం : 2
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు
కోపంతో ఎరబ్రడి కసిరే నా కళ్లు
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు
గుండెసడి ఉలికిపడి ఒకటే కంగారు
చప్పున ఒకటైపోదాం ఈ దూరం చెరగనీ
ఎక్కడికైనా పోదాం మనలోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరదా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా


చిత్రం : ప్రేమతో...రా! (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.బాలు, హరిణి, బృందం