Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి : లోకాలే గెలవగ నిలిచినాస్నేహాల విలువలు
తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని
కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన
ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున
నీవే నీవే నీవే నీవుగా ॥

చరణం : 1
ఈ పువ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై
సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో
ఊపిరై ఎద చిలిపినై ఊపునై
కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై
కలిసే ఉంటే అంతే చాలురా ॥

చరణం : 2
ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారని కవ్ముగా
ముద్దివ్ముని ఎన్నాళ్లు కోరాలిరా
ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై
ఎదలోపల ఉంటూనే ఉన్నానుగా
సన్నారు స్వరముల మధురిమ
పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ
అన్నీ నీవై నన్నే చేరరా ॥

చిత్రం : బాలు (2005)
రచన : జొన్నవిత్తుల
సంగీతం : మణిశర్మ
గానం : మురళి, చిత్ర

పల్లవి :
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నాది
గుట్టులాగిందయ్యో పండు లాగి
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించనా నెప్పి నీది హాయి
తెప్పించనా ఊది ఊది

చరణం :
1 తగిన వేళల తొలిసారి
తెగని వేళల మలిసారి
పడక వేళల ప్రతిసారి
పగటి వేళల ఒకసారి
ఈ కోప తాపాలన్నీ తీరేలాగ
నన్నే ఊపాలి బ్రహ్మచారి
నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే
అయిపోనా భామచారి
అమ్మమ్మ అబ్బబ్బబ్బా
హయ్యయ్యయ్యో అంతా వినక
అచ్చచ్చో చిచ్చో పిచ్చో
సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక
చూపాలయ్యో ఊపు నీది
నాకు చెప్పాలయ్యో తీపి సోది
॥॥

చరణం : 2
నీకు బోలెడు అది ఉంది
నాకు బుట్టెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుంది
ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే
తేనెల్ల్లో ఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన
మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా
కావాలింకా అహా చురక
స్ర్తీలంక చూడాలింకా
నాతోనే తోడింక ఛీపో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది
నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ


చిత్రం : ఛత్రపతి (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కీరవాణి, సునీత

వువా వువా హూ... అహూ... అహూ...
రూబా రూబా హే రూబా రూబా
రూపం చూస్తే హాయిరబ్బా
తౌబా తౌబా హే తౌబా తౌబా
తూ హై మేరీ మెహబూబా
అయ్యయ్యయ్యో...
ఏం హాయే నీ వెంట తరుముతోందే
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే
సంతోషంలో ఈ నిమిషం
పిచ్చెక్కినట్టుగుందే
రూబ రూబా రూ...

చరణం : 1
ఇంచు దూరమే అడ్డున్నా
ఎలావుండగలవంటుంది
నిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేష్టలే చేస్తున్నా
తనేం చేసినా కాదనదే
ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ... ఈ ఆనందంలో
సదా ఉండాలనుందే
ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే
నీతో సాగే ఈ పయనం
ఆగేనా ఇక ఏ నిమిషం
చరణం : 2
రెక్కలొచ్చిన ట్టుటుందే
మదే తేలిపోతుంటుందే
రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే
నవ్వు నాకు తెగ నచ్చిందే
నడుస్తున్న కళ నచ్చిందే
నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే
ఓ... నువ్వేమంటున్నా
వినాలనిపిస్తు ఉందే
రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే
నీతో ఉండే సంతోషం
కాదా నిత్యం నా సొంతం

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారిస్ జయరాజ్
గానం : షాహిల్ హడ, చిన్మయి