Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

చరణం : 1
ఎన్నడు అందని పున్నమి జాబిలి (2)
కన్నుల ముందే కవ్విస్తుంటే
కలగా తోచి వలపులు పూచి (2)
తనువే మరచి తడబడుతుంటే
॥తెలుపను॥

చరణం : 2
గుడిలో వెలసిన దేవుడు ఎదురై (2)
కోరని వరాలే అందిస్తుంటే
ఆ భావనలో ఆరాధనలో (2)
అంతట నీవే అగపడుతుంటే
॥తెలుపను॥

చిత్రం : చిన్ననాటి కలలు (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
ఓ వెన్నెల... తెలిసేదెలా నే...
ఓ నేస్తమా... నిలిచేదెలా నే...
కళ్లు కళ్లు కలిశాయంటా
వలపే పూవై పూచిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్లా ॥కళ్లు॥
ఓ వెన్నెల కలిపేదెలా...

చరణం : 1
జడివాన నింగినీ తడి చేయునా?
గంధాలు పూవుని విడిపోవునా?
న న్నడిగి ప్రేమా ఎదచేరెనా
వలదన్న ఎదనూ విడిపోవునా
మరిచాను అన్న మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెల కలిపేదెలా నే...

చరణం : 2
వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బ్రతకూ బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే
కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమా చనిపోదులే
ఏనాటికైనా నిను చేరులే
॥వెన్నెల॥

చిత్రం : ప్రేమదేశం (1996)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఉన్నికృష్ణన్

పల్లవి :
అందగాడా అందగాడా
అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా
అందమంతా నీదిరా
మల్లెమొగ్గ మల్లెమొగ్గ
రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క
అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా
రాతిరంతా హాయిగా ॥

చరణం : 1
గాలే తాకని నాలో సోకుని
ఇన్నాళ్లుంచానయ్యో నీకోసం
నా అందం చందం అంతా నీకోసం
తోడే లేదని కాలే కౌగిలి
ఎప్పటినుంచి ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం
ఎంతో దూరం
ముందరే ఉందిగా
సొంతమయ్యే సంతోషం


చరణం : 2
జారే పైటకి తూలే మాటకి
తాపం పెంచిందయ్యో నీరూపం
ఏనాడూ లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం
పెంచిందయ్యో నీస్నేహం
గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే
నాలో మౌనం
కాలమై సాగెనే అంతులేని ఆనందం


చిత్రం : ఘర్షణ (2004)
రచన : కులశేఖర్
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : హరిణి