Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో
జాలినవ్వు జాజి దండలో
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...

చరణం : 1
కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి (2)
నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా
వద్దంటే ఒట్టుగా...
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి (2)
అడుగు మడుగులొత్తనా మెత్తగా...
ఔనంటే తప్పుగా...
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా

చరణం : 2
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి (2)
పొగడదండలల్లుకోనా పూజగా...
పులకింతల పూజగా...
తొలిజన్మల నోముకి దొర నవ్వుల సామికి (2)
చెలిమై నేనుండిపోనా చల్లగా...
మరుమల్లెలు చల్లగా...
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...

చిత్రం : ముద్దమందారం (1981)
రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ


చరణం : 1
ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే
విరగబూసిన వెన్నెల వదిలివేయకే నన్నిలా
రా రా దా ఎద నీవే కాదా
నిదురనిచ్చే జాబిలి నిదుర లేక నీవే వాడినావా


చరణం : 2
మంచు తెరలో కలిసిపోయి
మదన సంధ్య తూగెనే
పుడమి ఒడిలో కలలు కంటూ
పాపా నీవు నిదురపో
మల్లె అందం మగువకెరుక
మనసు బాధ తెలియదా
గుండెనిండా ఊసులే నీ ఎదుటనుంటే మౌనమే
జోలపాట పాడినానే నిదుర లేక వాడినా


చిత్రం : ప్రేమదేశం (1996)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఉన్నికృష్ణన్, మనో

పల్లవి :
మేడమీద మేడగట్టి కోట్లు
కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి
అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
దిగి రాముందు ॥
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)

చరణం : 1
ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు
ఊడగొట్టు ఆకతాయి కామందు
మీసకట్టు తీసివేసి కాసపోసికోకచుట్టి
గాజులేసికొమ్మందు ॥
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము
డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)

చరణం : 2
రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా (2)
రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే
మాపటి వేళకు మీ పని నేపడతానోయ్
బుచ్చబ్బాయ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము
ఆడితీరుతామ్ పోరాడితీరుతామ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ (3)

చిత్రం : ప్రేమించిచూడు (1965)
రచన : ముళ్లపూడి వెంకటరమణ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి.బి.శ్రీనివాస్, బృందం