Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
మనసిచ్చి ఇచ్చి బరువాయె
వయసొచ్చి గిచ్చి గొడవాయె
ఇది ఏమి ప్రేమరో... ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో... ఓ... ॥

చరణం : 1
ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిశా తీర్చు గుణపాఠం
చలి వేళ ఎద గోల అదిరేలా అధరాలే అందాలే
చలి భలే లేవోయి చెలే నీదోయి
పెదాలే తేనె జల్లోయి ఈ జతలో॥

చరణం : 2
ఓరి తనువా ఇంత చనువా చాటు చె లగాటం
ఓసి మగువా ఉంటె చొరవ లేదు మొగమాటం
తెరతీశా పెన వేశా గురిచూశా
పరిచేశా ప్రాయాలే
సొగసరే నీ పేరు సరేలే జోరు చలంటూ లేదు
సందేళ కథలో


చిత్రం : హలోబ్రదర్ (1994)
రచన : వేటూరి
సంగీతం : రాజ్-కోటి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
Listen the Song:
R A A G A

చిత్రం : దేవదాసు (1953)
రచన : సముద్రాల రాఘవాచార్య
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : ఘంటసాల, కె.రాణి

పల్లవి :చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు (2)
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే (2)
మిగిలిందీ నీవేనే...
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే (2)
నీ దారే వేరాయే...
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే

చరణం : 1
మరపురానీ బాధకన్నా మధురమే లేదూ (2)
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ (2)
అందరానీ పొందుకన్నా అందమే లేదూ
ఆనందమే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

చరణం : 2
వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే (2)
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే (2)
దారిలేని బాధతో నేనారిపోయేనా
కథ తీరిపోయేనా
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
మిగిలిందీ నీవేనే...



16/03/2011 - నేడు సముద్రాల సీనియర్ వర్ధంతి

పల్లవి :
కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల
జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా (2)
చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల
జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశ లతలోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా


చరణం : 1
ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి
కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ


చరణం : 2
మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా హా హా
మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా హా హా
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నాపైన నెగ్గవమ్మ అదంత
తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ


చిత్రం : ఆంధ్రుడు (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : కళ్యాణి మాలిక్
గానం : శ్రేయాఘోషల్