Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చిత్రం :గుప్పెడు మనసు
గానం :ఎమ్. బాలమురళీకృష్ణ
రచన: ఆత్రేయ
సంగీతం:ఎమ్.ఎస్.విశ్వనాధన్


శ్రీరామ జయ రామ సీతారామ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

చరణాలు కొలిచే నగుమోము జూచే ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామ

నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

చిత్రం :ముత్యాల ముగ్గు
గానం :ఎమ్.బాలమురళీకృష్ణ
సంగీతం:కె.వి.మహదేవన్

ఓలియొ ఓలియొ హొరెత్తాలే గోదారి
ఎల్లువై తుల్లాబిలా గట్టుజారి
ఓలియొ ఓలియొ ఊరేగాలే సింగారి
ఇంతకి యాడుందే అత్తింటి దారి..

హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...

హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా కులికెనురా కన్నెధారా...

ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా..

హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేం కులికెనురా కన్నెతారా...

హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...

హో....వగలమారి నావ హొయలు మీరినావా
అలల ఊయలూగినావా...
తళుకు చూపినావా తలపు రేపినావా
కలలవెంట లాగినావా...

సరదా మది నీవే అడుగే ఏమారి
సుడిలో పడదోసి అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి
పడవ పోదాం పద ఆగకే మరి..

హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నతారా...

నీటిలోని నీడ చేతికందుతుందా
తాకి చూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడి కాదా
తరిమిచూడు దొరుకుతుందా...

చక్కని దానా చుక్కాని కానా
నీ చిక్కులన్నీ దాటగా
వద్దు అనుకున్నా వదలదు నెఱజాన
నేనే నీ జంట అని రాసి ఉందిగా...

హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నెతారా...


చిత్రం ; ఆట
రచన : సిరివెన్నెల
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం : కార్తీక్, చిత్ర