సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యచ్చనైన ఊసులెన్నొ రెచ్చకొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడిపేలేని సీకటే ఉండిపోనీ
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రావఁచిలకా సద్దుకుపోయే సీకటెనకా …
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఊ ఊ నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు యేనాటికీ ..
పక్కవారి గుండెలనిండా .. చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెలనిండా .. చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది ..
నమ్మకు నమ్మకు
అరె.. నమ్మకు నమ్మకు
ఆహా .. నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలై ….నా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఆహా … నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అహ ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
చిత్రం : రుద్రవీణ
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
AvESamantA AlApanElE - ఆవేశమంతా ఆలాపనేలే
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే
ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాల
ఆవేశమంత||
నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం
నిదురలేచె నాలో హృదయమే
ఆవేశమంత||
సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగస గమగమ నిసనిస గమగపదనిస
వనకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిఫించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికే మోహం
బదులులెని ఏదో పిలుపులా
ఆవేశమంత||
చిత్రం : ఆలాపన
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన :వేటూరి సుందర్రామ్మూర్తి
సంగీతం: ఇళయరాజా
ఆవేశమంతా ఆలాపనేలే
ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జలించే స్వరాల
ఆవేశమంత||
నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం
నిదురలేచె నాలో హృదయమే
ఆవేశమంత||
సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగస గమగమ నిసనిస గమగపదనిస
వనకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిఫించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికే మోహం
బదులులెని ఏదో పిలుపులా
ఆవేశమంత||
చిత్రం : ఆలాపన
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన :వేటూరి సుందర్రామ్మూర్తి
సంగీతం: ఇళయరాజా
gOra~mka kendukO - గోరంకకెందుకో కొండంత
గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంక||
కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
గోరంకకెందుకో||
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో
గోరంక||
చిత్రం : దాగుడు మూతలు
గానం :సుశీల
రచన: దాశరథి
సంగీతం:కె.వి.మహదేవన్
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంక||
కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
గోరంకకెందుకో||
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో
గోరంక||
చిత్రం : దాగుడు మూతలు
గానం :సుశీల
రచన: దాశరథి
సంగీతం:కె.వి.మహదేవన్