Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : బడ్జెట్ పద్మనాభం (2001)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ॥

చరణం : 1
అవమానాలే ఆభరణాలు
అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
అనుకోవాలీ అడుగేయాలీ
ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తున్నా కలలేకన్నా
పూల స్వర్గాన్ని అధిరోహించాలి
ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ॥

చరణం : 2
బలము నువ్వే బలగం నువ్వే
ఆటా నీదే గెలుపూ నీదే
నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
నింగిలోన తెల్లమేఘం
నల్లబడితేనే జల్లులు కురిసేను
చెట్టుపైనా పూలు మొత్తం
రాలిపోతేనే పిందెలు కాసేను
ఒక ఉదయం ముందర చీకట్లు
విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు ॥

చిత్రం : మేలుకొలుపు (1978)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఎస్.జానకి, బృందం


పల్లవి :
దారితప్పిన బాలల్లారా...
దగా పడిన యువకుల్లారా
చెడు అనవద్దు చెడు వినవద్దు
చెడు కనవద్దు... ఇది బాపూజీ పిలుపు
ఇదే మేలుకొలుపు ఇదే మేలుకొలుపు ॥అనవద్దు॥

చరణం : 1
ఇంటిని కాల్చే మంటల్లాగ ఎందుకు బ్రతకాలి
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగ ఎపుడూ వెలగాల॥
మానవతయే మన దైవం
మంచితనమే మన ధర్మం (2) ॥అనవద్దు॥

చరణం : 2
పచ్చని తెలివి విషమించిందా రక్కసులౌతారు పచ్చని తెలివి విషమించిందా రక్కసులౌతారు
అది మంచి దారిలో మలచుకొంటిరా మహాత్ములౌతారు మహాత్ములౌతారు
పరోపకారం పరమగుణం... పరమగుణం
సహనం మన ఆభరణం... ఆభరణం... ఆ... ॥అనవద్దు॥

April, 23 - నేడు ఎస్.జానకి బర్త్‌డే

చిత్రం : చినరాయుడు (1992)
రచన : భువనచంద్ర
సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి
చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి...
నింగికి నేలకు నిచ్చెన వేసిన
దేవుడు నీవే చినరాయుడు నీవే ॥

చరణం : 1
గాలిలోన తేలే పరువాల పూల కొమ్మ
నేలవాలిపోగా చివురింప చేసినావే
పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ
మనిషిమీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ
తప్పవురా హేళనలు వేదనలే నీ హితులు
గుండెకు బండకు వారధి కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల ॥

చరణం : 2
నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక
గూటిలోని చిలుక గుబులేదొ ఎవరికెరుక
నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు
న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు
ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల ॥