Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : పాండురంగ మహాత్మ్యం (1957)
రచన : సముద్రాల రామానుజాచార్య
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల


పల్లవి :
అహహహహా అహహహహా...
ఓహొహొహొహో ఓ ఓ ఓహొహో...
తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో ఆనందం అందం ఆనందం ॥

అనుపల్లవి :
ఆనంద లీలే గోవిందరూపం
ఈ మాట అంటే పెద్దలకు కోపం ॥

చరణం : 1
మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజి చెక్కిళ్ల సోయగాల విందులు ॥
వరద పొంగేనులే వయసు సింగారము
అనుభవించీ సుఖించీ తరించరా... హోయ్ ॥

చరణం : 2
మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటులేలనే ॥
నేడు వెనకాడినా రేపు ఒనగూడునా
అనుభవించీ సుఖించీ తరించరా... హోయ్ ॥॥

03 May - నేడు సముద్రాల జూనియర్ వర్ధంతి

చిత్రం : మేఘసందేశం (1982)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : పి.సుశీల


పల్లవి :
ముందు తెలిసెనా ప్రభూ...
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో కాస్త...॥

చరణం : 1
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద
సుమదళములు పరువనా (2)
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును... ॥

చరణం : 2
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగా
నీ పదముల బంధింపలేను
హృదయము సంకెల జేసి ॥

చిత్రం : ఎర్రమల్లెలు(1981)
రచన : అదృష్ట దీపక్
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం


పల్లవి :
అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు
ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు
అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా
కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 1
సమభావం మానవాళి గుండెలలో నిండగా
సకలదేశ కార్మికులకు ఈనాడే పండ గ
లోకానికి శ్రమ విలువను చాటిన రోజు
ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 2
వేదనలూ రోదనలూ
వేదనలూ రోదనలూ అంతరింపజెయ్యాలని
బాధల కేదారంలో శోధన మొలకెత్తింది
చిరకాలపు దోపిడిపై
తిరుగుబాటు జరిగినపుడు
చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 3
భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన
రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి
బిగిసిన ఈ పిడికిళ్లూ ఎగిసిన ఆ కొడవళ్లూ
శ్రామికజన సారథిగా క్రమించమని అడిగాయి
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 4
ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాల
ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు
ఐక్యంగా నిలవాలి కదనానికి కదలాలి
సామ్యవాద సాధనకై సమరం సాగించాలి
మేడే నేడే మేడే నేడే (3)