Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : బంగారుబొమ్మలు (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల



పల్లవి :
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...॥

చరణం : 1
కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో (2)
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ...
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ॥

చరణం : 2
నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో...
అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో... నీ దోర వయసులో...
వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ
చిరుగాలుల తుంపరగా...
చిరునవ్వుల సంపదగా...॥॥॥

చరణం : 3
పంట పొలాల్లో పచ్చదనంగా
పైరగాలిలో చల్లదనంగా ॥
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ...
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥

07 May - ఆచార్య ఆత్రేయ జయంతి

చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత గానముతో నీవు నటన సేయగనే
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే ॥
చరణం : 1
నీకు నాకు స్వాగతమనగా
కోయిలమ్మ కూయగా (2)
గలగలగల సెలయేరులలో
కలకలములు రేగగా ॥
చరణం : 2
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా (2)
భ్రమరమ్ములు గుములు గుములుగా
ఝుం ఝుమ్మని పాడగా ॥
చరణం : 3
తెలి మబ్బులు కొండ కొనలపై
హంసల వలె ఆడగా (2)
రంగరంగ వైభవములతో
ప్రకృతి విందు సేయగా ॥


06 May - పింగళి వర్ధంతి

చిత్రం : ప్రేమలేఖలు (1977)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి : ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥

చరణం : 1
ఆ... హా హా హా... ఆహా... ఆహాహా... సుజా...
నడిరాతిరి వేళ పిలుపు
గిలిగింతలతో నను ఉసిగొలుపు ॥
నను చేతులతో నను పెనవేసి
నా ఒడిలో వాలును నీవలపు ॥తీయని॥

చరణం : 2
నా మనసే కోవెల చేసితిని
ఆ గుడిలో నిన్నే నిలిపితిని ॥మనసే॥
నీ ఒంపులు తిరిగే అందాలు
కనువిందులు చేసే శిల్పాలు ॥తీయని॥

చరణం : 3
నీ పెదవులు చిలికే మధురిమలు
అనురాగము పలికే సరిగమలు ॥పెదవులు॥
మన తనువులు కలిపే రాగాలు
కలకాలం నిలిచే కావ్యాలు ॥తీయని॥