Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్


గానం : గోపిక పూర్ణిమ
అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను... నేను
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను... కోను
ఎందులోను నీకు నేను తీసిపోను
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను
పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను
ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోను
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను
హోయ్ హోయ్ హోయ్ హే...
సూటు బూటు స్టైలు సుందరా
లేనిపోని డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా
రేవులోని తాటిచెట్టులా నీ ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా
నేల దించుకో ఓయ్

గానం : మల్లికార్జున్

హే... నింగి జారిపడ్డ చందమామ ముక్క
లేనిపోని టెక్కు నీకు జన్మ హ క్కా
చాల్లే చిందులాట కోతి పిల్లా
హే... అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా
హే... చిన్న పల్లెటూరి బావిలోన కప్ప
నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా
హే... నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా
మీసమున్న కుర్రవాణ్నిలే
వీధికొస్తే ఊరుకోనులే... ఏ..
కొండతోటి పందెమేయకే
నొప్పులు ఒప్పులు తప్పవే మరి
హే... పంతం మానుకోవే పాలకోవా
పచ్చిమిర్చితోటి పందెమేస్తే
ఓడిపోవా... హే హే...

చిత్రం : జయం మనదేరా! (2000)
సంగీతం, గానం : వందేమాతరం శ్రీనివాస్


పల్లవి :
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ॥చిన్ని॥
ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే
తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే
ఆనందము ఆకాశము
సందడై సంద్రమై ఉప్పొంగెనే ॥చిన్ని॥

చరణం : 1
నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు
నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు
చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
పండగై ఉంటాడు ఆడంగ పాడంగ
కలగలిసి ఉండాలి దండుగా
కడదాక ఉంటాను అండగా
సాగరా చాటరా జయం మనదేరా! ॥చిన్ని॥

చరణం : 2
పంటలతో నేల తల్లి పొంగెనే
సంపదతో పల్లెలన్నీ నిండెనే
సాగరా చాటరా జయం మనదేరా!
లల్లలాల లాలెలల్లా లాలెలల్లల్లే
నానా నాలె లాలె లాల్లలల్లల్లా

చిత్రం : కలసిన మనసులు (1968)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఎం.ఎస్.రాజేశ్వరి


పల్లవి :
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అయ్యై జే జైనా అమ్మ పిమ్మటే ॥అమ్మ॥

చరణం : 1
బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినా
పొంగిపోవు కడుపు తీపి అమ్మది
కుసిలి కుసిలి పాలకై గుండెమీద గుద్దినా
మురిసిపోవు వెన్న మనసు అమ్మది ॥అమ్మ॥

చరణం : 2
గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది (2)
లాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుంది
ఆ రామునికి అమ్మకంటే రక్ష ఏమి ఉన్నదీ? ॥అమ్మ॥

చరణం : 3
అమ్మ ఉంటే లేనిదేమీ లేనేలేదు
అమ్మ లేక ఏమి ఉన్నా ఉన్నది కాదు
అమ్మంటే త్యాగము అమ్మే ఒక యోగము
అమ్మంటే సత్యము అమ్మే సర్వస్వము

08 May - మదర్స్ డే సందర్భంగా