Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

ఓ పిల్లా హేయ్...
చిత్రం : జీవితచక్రం (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : శంకర్-జైకిషన్
గానం : ఘంటసాల


పల్లవి :
కంటిచూపు చెపుతోంది
కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా॥
ఆశలు దాచకు... ఆశలు దాచకు...


చరణం : 1
ఆడపిల్లపూలతీగె ఒక్కలాగే చక్కనైనవి (2)
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే
అండ కోరుకుంటాయి ఆ... హా...
అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు... ఓ పిల్లా
స్నేహము చేయవా స్నేహము చేయవా


చరణం : 2
కొమ్మమీద గోరువంక రామచిలక జోడు గూడె కొమ్మమీద గోరువంక రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ... హా...
మెత్తనైన మనసు నీది కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది ఓ పిల్లా
మైకము పెంచుకో మైకము పెంచుకో


చరణం : 3
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ... హా...
నువ్వు నన్ను చేరాలి నేను మనసు ఇవ్వాలి
ఎడములేక ఉండాలి ఓ పిల్లా ॥
వస్తావా మురిపిస్తావా (2)
॥॥

చిత్రం : నువ్వు-నేను (2001)
రచన : కులశేఖర్
సంగీతం : ఆర్.పి.పట్నాయక్


నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వునేను
చరితలోన నిలిచిపోయే
ప్రేమికులమే నువ్వునేను
నింగి నేల నీరు సాక్షిగా... ఆ...
కొండ కోన వాగు సాక్షిగా... ప్రేమా... ఆ...

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వునేను
లోకమంతా ఏకమైన వేరుకాము నువ్వునేను
ఆలయాన దైవం సాక్షిగా
గుండెలోని ప్రేమ సాక్షిగా... ప్రేమా... ఆ...

గానం : ఆర్.పి.పట్నాయుక్, ఉష
--------
ప్రియతమా... ఓ ప్రియతమా
నను వీడిపోవద్దనీ పలికే హృదయం
నీకు గుర్తున్నదా తొలినాటి మన పరిచయం
నీవు నాలో ఇలా పదిలం... ॥
గానం : ఉష
--------
Listen:


neekunenu naaku nuvvu

చిత్రం : గుండమ్మ కథ (1962)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం, గానం : ఘంటసాల


పల్లవి :
కోలుకోలోయన్న కోలో నాసామి
కొమ్మలిద్దరు మంచి జోడు ॥
మేలుమేలోయన్న మేలో నారంగ
కొమ్మలకు వచ్చింది ఈడు ॥
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు ॥
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

చరణం : 1
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల ॥
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకలా కులికేను చాలా
బేలబేలోయన్న దిద్దినకదిన
దిద్దినకదిన దిద్దినకదిన దిన్ ॥
ఈ బేల పలికితే ముత్యాలు రాల ॥
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

చరణం : 2
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమొ మంచిదే పాపం ॥
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంటచూసిన పోవు తాపం ॥
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం ॥
ఆహాహా... ఆ ఆ ఆ... ఓహొహో... ఓ ఓ ఓ...

28 May - నేడు ఎన్.టి.ఆర్. జయంతి