Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : అభినందన (1988)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.జానకి


పల్లవి :
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు (2) ॥

చరణం :
ఈ పిల్లకు మనసైంది ఆ కళ్లకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది ఈ బుగ్గకు సిగ్గైంది
కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు
పెళ్లికి మాకేమిస్తారు..?
కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు... ॥
------------

పల్లవి :
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు (2) ॥

చరణం :
ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు
ఆ బంధం వేశాడు సంబంధం చేశాడు
ఆ పిల్ల... అతనికి అనుకోకుండా
ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది...
ఇన్నాళ్లూ ప్రేమించిన
పిల్లాడేమో పిచ్చోడయ్యాడు
పిల్లాడేమో... పిచ్చోడయ్యాడు

Chukkalanti Amma - Abhinandana - Sobhana & Karthik Muthuraman - Music: Ilaiyaraaja

చిత్రం : అమ్మాయిలు-అబ్బాయిలు (2003)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి , గానం : చక్రి, కౌసల్య


పల్లవి :
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే (2)
నాతో నీవు ఉంటే ఆనందం నావెంటే
ఈరోజే మెరిసింది ఒక తారకా
నీ స్నేహం కోరింది మనసాగకా
హోయి హోయి హోయి
హోయి హోయి హోయి (2)
మళ్లీ మళ్లీ రాదు మనకోసం ఈ రోజు
చేయి కలిపి చూడు మధుమాసం ప్రతిరోజు

చరణం : 1
చెప్పనా నీ రూపమే ఎద చేరిందని
చెప్పకా ఇక తప్పదూ ఇది ప్రేమేనని
పరుగులు తీసే వయసులలోన
కోరిక తరుమునులే
ప్రేమని దానికి పేరుని పెడితే తప్పేనులే
మీకేం మగవారు తెగ మాటలు చెబుతారు
ఇంతా తెలిశాక ఇక చాలు చాలు మరి
చూపులెందుకని ॥॥

చరణం : 2
హాయిగా నీ ధ్యాసలో నిదురించాలని
సాయమే చెలి కోరితే ఇటు రావేం మరి
ఇరువురి మనసులు కలవని ప్రేమ
ఎన్నడు గెలవదులే
చెదిరిన మదిలో చెలిమికి చోటే లేదందిలే
నిండా ప్రేముండి మీరెందుకు దాస్తారూ
అయ్యో అమ్మాయో ఇది ప్రేమకాదు
అని తెలుసుకోవె మరి ॥॥

05 June - నేడు భాస్కరభట్ల బర్త్‌డే

చిత్రం : సంకీర్తన (1987)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, బృందం

పల్లవి :
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
అలలు శిలలు తెలిపే కథలు
పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన
ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే
ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి
పల్లె పల్లె పచ్చని పందిరి
పల్లె పల్లె పచ్చని పందిరి
నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు
పంటలకేమి సందడీ
పంట పంటాలకేమి సందడి
తందైన తందతైన తందైన తందతైన
తందైన తందతైయ్యనా
తయ్య తందైన తందతైయ్యనా

చరణం :
వానవేలితోటి నేల వీణ మీటే
నీలినింగి పాటే వీచెనట
కాళిదాసులాంటి తోచరాసుకున్న
కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతికదలికలో నాట్యమే కాదా
ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా
ఎదకే కనులుంటే... ॥॥

04 June - నేడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బర్త్‌డే