Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : ఆత్మగౌరవం (1965)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల

పల్లవి :
అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

చరణం : 1
ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే (2)
చెలికాడే నాలో తలపులు రేపెనులే
అందెను నేడే అందని జాబిల్లి

చరణం : 2
నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే (2)
నెలరాజే నాతో సరసములాడెనులే
అందెను నేడే అందని జాబిల్లి

చరణం : 3
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే (2)
వలరాజే నాలో వలపులు చిలికెనులే ॥

Aathma Gowravam - andenu nEDE andani jAbilli


చిత్రం : నేను.. నా రాక్షసి (2011)
రచన, సంగీతం : రహమాన్
గానం : శంకర్ మహదేవన్


పల్లవి :
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండె ల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు
మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురని మరిచి
అలుపెరుగక వెతికా వెతికా ॥మళ్లీ॥

చరణం : 1
అది మోనాలిసా చెల్లెలో
మరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బంధువో
నా దాహం తీర్చే బిందువో
ఎవరిదీ అసలెవరిదీ...
ఇంతలా నను నిలువున తడిపిన
తొలకరి చినుకును
వెతికా వెతికా వెతికా వెతికా ॥మళ్లీ॥

చరణం : 2
ఏం పని లేదో ఏమిటో నాపై తనకి హక్కేమిటో
నన్నే నాకు వేరుగ నెట్టేసే ఈ ప్లానేమిటో
హాయిది తొలి దిగులుదీ...
వింతగా ఎద తొలిచిన గెలిచిన
సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా ॥మళ్లీ॥

చిత్రం : అభినందన (1988)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.జానకి


పల్లవి :
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు (2) ॥

చరణం :
ఈ పిల్లకు మనసైంది ఆ కళ్లకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది ఈ బుగ్గకు సిగ్గైంది
కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు
పెళ్లికి మాకేమిస్తారు..?
కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు... ॥
------------

పల్లవి :
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు (2) ॥

చరణం :
ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు
ఆ బంధం వేశాడు సంబంధం చేశాడు
ఆ పిల్ల... అతనికి అనుకోకుండా
ఇల్లాలయ్యింది
అనుకోకుండా ఇల్లాలయ్యింది...
ఇన్నాళ్లూ ప్రేమించిన
పిల్లాడేమో పిచ్చోడయ్యాడు
పిల్లాడేమో... పిచ్చోడయ్యాడు

Chukkalanti Amma - Abhinandana - Sobhana & Karthik Muthuraman - Music: Ilaiyaraaja