Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సత్యం (2003),
రచన : భాస్కరభట్ల
సంగీతం : చక్రి,
గానం : చక్రి, రవివర్మ, రమేష్, పల్లవి

పల్లవి :
పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ
మనసుకు తొలికలవర మా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఏమీకాదో క్షణికం అన్నీ తానే ప్రణయం
ఐ లవ్ యూ లవ్ యూ రా (4)॥

చరణం : 1
వలపును చినుకుగ భావించా
అది నా తప్పుకదా
వరదని తెలిసిన ఈ తరుణం
యాతన తప్పదుగా
ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ... (2) ॥

చరణం : 2
మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా
ఆపాలి ఏదోలా చె బుతావా ప్రియురాలా
నీడై నీతో పాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగీ నేల కలవవనీ నీడే మనిషిని తాకదనీ
ప్రేమ ప్రేమ ప్రేమ... (2)
ఆపిన ఆగదు ప్రేమ దాచిన దాగదు ప్రేమ
మనసును కలుపును ప్రేమ
మహిమలు చూపును ప్రేమ
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం
ఐ లవ్ యూ లవ్ యూ రా (4)

15 June - నేడు చక్రి బర్త్‌డే

చిత్రం : కోకిలమ్మ (1983)
రచన : ఆచార్య ఆత్రేయు
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : పి.సుశీల


పల్లవి :
కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నది... ఓహో అన్నది ॥

చరణం : 1
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో ॥
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శ్రుతిచేసి లయకూర్చునో ॥
అని తల్లి అన్నది అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది కలలు కన్నది ॥తల్లి॥॥

చరణం : 2
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు ॥లేత॥
నాకు తెలిసింది నీ నిండుమనసే
నేను పాడే ది నీ పాటనే ॥
అని ఎవరు అన్నది అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నది ॥ఎవరు॥॥

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్


పల్లవి :
ఒరె ఒరె ఒరె ఒరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కుపోయె
గల గల గల గల గలాట లేక
విల విల విల దిల్ తరుక్కుపోయె
కంప్యూటర్లు మూసేయ్
సెల్‌ఫోను తీసి దాచేయ్
పెళ్లింట్లో ఇవన్నీ దేనికో...
మైండు బ్లాంకు చేసెయ్
ఆలోచనలు మానెయ్ మ్యారే జే నీధ్యాసై
బె స్టు గెస్టులా నువ్వు నడుచుకో
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్సన్నీ లైట్ తీస్కో ॥ఒరె॥

చరణం : 1
బళ్లోకెళ్లి పాఠం వింటాం
గుళ్లోకెళ్లి పూజలు చేస్తాం
ఆఫీసైతే డ్యూటీ చేస్తాం
మరి పెళ్లింట్లోనో ఎంజాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్టా పెళ్లిలో
సావాసం సంతోషం పెంచే అవకాశం
కల్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు
నలుగురితో కలుపుకో ॥తీస్కో॥

చరణం : 2
నీతో స్నేహం అరె నాకేం లాభం
అనేంతలాగ మారింది లోకం
నువ్వూ మౌనం అరె నేనూ మౌనం
మనసూ మనసూ మరింత దూరం
అక్కా పిన్నీ బాబాయ్ బుజ్జీ బావా చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది డైలీ సీరియల్ కాదోయ్ మళ్లీ మళ్లీ రాదోయ్
ఈ ఒక్కరోజు కొంచెం నీ బిజీ టైం
బంధువులకిచ్చుకో ॥తీస్కో॥

Mr.Perfect Light Theesko Prabhas Kajal Full Song High Quality