Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : ప్రేమపక్షులు (1973)
రచన : ఉషఃశ్రీ
సంగీతం : అశ్వత్థామ
గానం : కె.జె.ఏసుదాస్


పల్లవి :
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

చరణం : 1
రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
ఒళ్లంతా బరువైనాది కళ్లేమో ఎరుపైనాయి (2)

చరణం : 2
సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు (2)
సంకురేతిరి సల్లో కూడ బింకమేటని అంటారు
బింకమేటని అంటారు


చరణం : 3
ఒద్దికగా నా ఒళ్లో ఒదిగి
ముద్దుముద్దుగా నను మురిపిస్తే
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను (2)


Photo: కె.జె.ఏసుదాస్

చిత్రం : వంశవృక్షం (1980)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : బాలు, శైలజ, బృందం


పల్లవి :
వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా (2)
గోపవనితా హృదయ సరసీ
రాజహంస కృష్ణా కృష్ణా ॥॥

చరణం : 1
పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరంలో
నిలిచింది గీతా సారంలో ॥॥

చరణం : 2
ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది అంతా నీవేలే అన్నీ నీ లీలలే ॥॥

చరణం : 3
నోటిలో ధరణి చూపిన కృష్ణా
గోటితో గిరిని మోసిన కృష్ణా
ఆటగా రణము నడిపిన కృష్ణా (2)
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా (2)
కిలకిల మువ్వలకేళీ కృష్ణా
తకధిమి తకధిమి తాండవ కృష్ణా
కేళీ కృష్ణా తాండవ కృష్ణా (3)

Photo:
కె.వి.మహదేవన్

చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : పి.లీల


పల్లవి :
తెల్లవారవచ్చె తెలియక నా సామి (2)
మళ్లీ పరుండేవు లేరా... (2)
మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు (2)
మారాము చాలింక లేరా (2) ॥

చరణం : 1
కలకలమని పక్షిగణములు చెదిరేను
కల్యాణ గుణధామ లేరా (2)
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా (2)
దైవరాయ నిదుర లేరా...

చరణం : 2
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా ॥
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా ॥॥