Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : స్వయంవరం (1999)
రచన : భువనచంద్ర
సంగీతం : వ ందేమాతరం శ్రీనివాస్
గానం : ఉదిత్‌నారాయణ్, స్వర్ణలత


పల్లవి :
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్తకొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా
నిన్నుతాకి పొంగిపోవు నీలిమబ్బుని నేనంటా
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జతచేరగా రావా॥

చరణం : 1
మంచు వెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో
ఏకాంతసేవకు ఉర్రూతలూగిన
శృంగార శిల్పానివా
కల్యాణ రాముని కౌగిట్లో ఒదిగిన
బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనీ
ప్రేమగా తీయగా తియతీయగా
తమకానివై ప్రేమ ॥

చరణం : 2
కదనసీమకు కాలుదువ్విన గడుసు మన్మథుడా
కౌగిలింతల కాటువెయ్యకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన
వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు తియ్యక
అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా॥

చిత్రం : పెళ్లిపుస్తకం (1991)
(మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత : ముళ్లపూడి వెంకటరమణ)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల



పల్లవి :
ఆయి ఆయి శ్రీ రంగశాయి (2)
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి (2) ॥ఆయి॥
ఏదీకాని వేళ ఎడద ఉయ్యాల (2)
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల ॥ఆయి॥

చరణం : 1
అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు
అభిమానమే చాలు అణుచుకొన మేలు ॥ఆయి॥

చరణం : 2
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు ॥
మాగన్నులోనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్ష

28 June - నేడు ముళ్లపూడి వెంకటరమణ జయంతి

చిత్రం : నువ్వువస్తావని (2000)
రచన : ఇ.ఎస్.మూర్తి
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : హరిహరన్, చిత్ర


పల్లవి :
కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
వస్తూ వస్తూ తనతో
వెన్నెల వెలుగులు తెస్తోంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
పూల పొదరిల్లే రా రామ్మన్నది
విన్నానమ్మా తీయని వేణువు
రమ్మను పిలుపుల్నీ
చూశానమ్మా స్వాగతమంటూ
తెరిచిన తలుపులనీ

చరణం : 1
పగలూ రాత్రి అంటూ తేడా లేనేలేని
పసిపాప నవ్వుల్ని చూడనీ
తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీకు
ఏనాటి ఋణముందో అడగనీ
చేదు చేదు కలలన్నీ కరిగి తే నె వరదవనీ
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని
ప్రతిజన్మకి ఈ నేస్తమే కావాలని
కోరుకుంటానమ్మా దేవుళ్లని
॥॥

చరణం : 2
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే
ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వర మే నువ్వే ఇస్తే
ఇంకేమి కావాలి ఈ జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా
వరసకాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదని
నీకు సొంతం అంటే నేనే అనీ ॥