Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : వేదం (2010)
రచన, సంగీతం,
గానం : ఎం.ఎం.కీరవాణి


పడిపాయ్ పడిపాయ్ పడిపాయ్
విడిపాయ్ విడిపాయ్ విడిపాయ్ ॥
ఇది చేతులు మారి
రాతలు మార్చే కాగితమోయ్
తను జేబుల నుంచి జేబులలోకి
దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయ్ రూ రూపాయ్
ఇది రూపాయ్ హాయ్ రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్ (2)
కోటలు మేడలు కట్టాలన్నా
కాటికి నలుగురు మోయాలన్నా
గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా
ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయ్

ఈ ఊసరవెల్లికి రంగులు రెండే బ్లాక్ ఆర్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచేవాడి రాంగ్ ఈజ్ రైట్
తన హుండీ నిండాలంటే
దేవుడికై నా మరి అవసరమేనోయ్
రూపాయ్ రూ రూపాయ్
ఇది రూపాయ్ హాయ్ రూపాయ్
రుప్పి రుప్పి రుప్పి రూపాయ్ (2)
పోయే ఊపిరి నిలవాలన్నా
పోరాటంలో గెలవాలన్నా
జీవనచక్రం తిరగాలన్నా
జననం నుంచి మరణం దాకా రూపాయ్

04 July - నేడు ఎం.ఎం.కీరవాణి బర్త్‌డే

చిత్రం : మాయాబజార్ (1957)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : మాధవపెద్ది సత్యం


అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన
శుంభధ్వజము గ్రాల చూడవలదె!
గగన పాతాళ లోకాలలోని సమస్త
భూత కోటులు నాకె మ్రొక్కవలదె!
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి
సంభ్రమాశ్చార్యాల జరుగవలదె
హై హై ఘటోత్కచ... జైహే ఘటోత్కచ
అని దేవగురుడె కొండాడవలదె
ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని
కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!
-------------------
జై సత్యసంకల్ప జై శేషతల్పా!
జై దుష్టసంహార జై దీనకల్పా!
జై భక్త పరిపాల జై జగజ్జాలా!
నీవు జరిపించేటి నీ చిత్ర కథలు
వ్రాసినా చూసినా వినిన ఎల్లరును
శుభసంపదలు గలిగి వర్థిల్లగలరు
సుఖశాంతులను గలిగి శోభిల్లగలరు!

03 July - నేడు ఎస్.వి.రంగారావు జయంతి

చిత్రం : పాతాళభైరవి (1951)
(దర్శకత్వం : కె.వి.రెడ్డి)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం, గానం : ఘంటసాల


పల్లవి :
కనుగొనగలనో లేనో...
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ
కనుగొనగలనో లేనో...

చరణం : 1
పెండ్లిపీటపై ప్రియనెడబాయ
గాలిమేడలూ గారడికాగా (2)
కలకాలమును కర్మను దూరుచు
కలగా బ్రతకడమేనో
కనుగొనగలనో లేనో...

చరణం : 2
వెదకివెదకి ఏ జాడ తెలియక
హృదయమంతా చీకటిగా (2)
ఎంత పిలచినా పిలుపే అందక
చింతిలి తిరగడమేనో
కనుగొనగలనో లేనో...

చరణం : 3
పులివాతను బడు బాలహరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా (2)
జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో ॥

01 July - నేడు కె.వి.రెడ్డి జయంతి