Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సర్వం (2010)
రచన : వెన్నెలకంటి
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : జావేద్ అలీ, మధుమిత


పల్లవి :
రెక్కలు వచ్చెను ఎగిరే ఎదకు
దిక్కులు కలిసెను చెలిమి కొరకు
చుక్కల చూపులు నిన్నే చూడగా
తనువే పొంగెను ఎగిసే కలగా
మనసే దూకెను ఉరికే అలగా
కొసరే కోరిక నిన్నే వెతకగా
కోరికోరి నిన్నెచేరా కొంతకాలం
కొంత దూరం కొంత విరహం
ఓర్చుకుందీ హృదయం
నిన్ను నేనే వెతుకు వేళ ఇదే లక్ష్యం ఇదే బాట
ఇదే పయనం ఇదే బతుకూ అయ్యెనూ
కనులే పొంగెను ఎగిసే కలగా
వయసే దూకెను ఉరికే అలగా
కొసరే కోరిక నిన్నే వెతకగా

చరణం : 1
ఓ కదిలే నది కెరటం కోసం తీరం కాచుకున్నది
కాసే సిరి వెన్నెల కోసం భూమి వేచియున్నది
ఓ మావిచాటు కోయిల గీతం
స్వరమెవరికి తెలుసు
కనుపాపల రాగం పలికే కలలెవరికి తెలుసు
చెలియా నే నిన్ను చేరగా
వచ్చా తీపి దాహం తీరగా
ఉన్నా నీ అడుగుజాడగా
నీతో తోడై వచ్చు నీడగా
నాదు హృదయం ఎక్కడుందీ పూవులోన నింగిపైన అగ్నిలోన గాలిపైన లేదులే
నీదు కన్నై నీదు ముద్దై నీదు రేయై నీదు హాయై నీదు ఆశై నీదు ఎదలో ఉందిలే

చరణం : 2
ఓ నాకే నే బరువైపోయి నన్ను మోసుకొచ్చానే
నీకే నే నీడగ మారి నిన్ను వెతుకుతున్నానే
కనుల నీరు జారే వేళ రెప్పవేళ లేదు
తనువునొదిలి ఏనాడైనా మనసు వెళ్లిపోదు
కాలం నాకై ఆగిపోయెనే
లోకం నాతో కలిసి సాగెనే
శోకం ఒక శ్లోకమాయెనే
సుఖమో బాధో హద్దు మీరెనే ॥
ఒక రెప్పేమో తేనైపోయే
ఒక రెప్పేమో చేదైపోయే
రెంటికి మధ్యన కలలే సాధ్యమా ॥కోరి॥

చిత్రం : అర్జున్ (2004)
రచన : వేటూరి, సంగీతం : మణిశర్మ
గానం : ఉన్నికృష్ణన్, హరిణి

పల్లవి :
మధుర మధురతర మీనాక్షి
కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి


జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ (2)
లేత సిగ్గుల సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా ॥

చరణం : 1
శృంగారం వాగైనది ఆ వాగే వైగై నది
ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని
కూచిపూడినో తకథిమితోం
విశ్వనాథుని ఏకవీర
ఆ తమిళ మహిళల వలపు కదా
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి

చరణం : 2
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నదీ
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నదీ
మధురనేలు మా తెలుగు నాయకుల
మధుర సాహితి రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచినా
తెలుగువీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి

11 July - నేడు మణిశర్మ బర్త్‌డే

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : కార్తీక్, సాకీ : మల్లికార్జున్


సాకీ :
ఎప్పటికీ తన గుప్పెట విప్పదు
ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

పల్లవి :
బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపలా కలిగిందా
ఏనాడైనా కల్లోలం ఇలా
ఈరోజేమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తయినా అనిపించిందారా ఎప్పటికీ

చరణం : 1
ఏదోలా చూస్తారే నిన్ను వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా
మునపటిలా లేవంటూ
కొందరు నిందిస్తూవుంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ
కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా ॥

చరణం : 2
నీ తీరే మారింది నిన్నకీ నేటికీ
నీ దారే మళ్లుతోందా కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే
నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూవుంటే నమ్మేదెలా
వెళ్లే మార్గం ముళ్లుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదెలా బదులు