Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి, సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్

పల్లవి :
నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే
రోజాపూలు ఆ ముళ్లచాటులో విరబూసే
తేనా ముళ్లు ఈ లేత పువ్వులా విరిసే
మళ్లీ మళ్లీ నిను చూడమంటూ కనులడిగే
గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే


చరణం : 1
పాదం నీవైపున్నా మది పంపదు అటు కాస్తై
నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషాన
వాగుల దరిలో ఉన్నా
జడివానలు ముంచేస్తున్నా
నినుచూడని ఏ క్షణమైనా ఎండమావేనా
హే... గువ్వ గువ్వ గువ్వ గువ్వ పసిగువ్వ
హే... నువ్వా నువ్వా నువ్వా నువ్వా ప్రతి దోవా
ఓ... నిరంతరం హుషారుగా తోచే
ప్రతి కల నిజాలుగా వేచే
అటు ఇటు షికారులే చేసే నా మనసే
ఓ... నిను నను ముడేసిన ఆశే
పదే పదే వయస్సునే పిలిచే
ఇవాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే॥

చరణం : 2
కాలికి మువ్వల గొలుసు
ఆ స్వరములు నేలకు తెలుసు
ఆ సడి విని వర్ణించైనా నీ ప్రతి సొగసు
జాబిలి నింగిని విడిచే హరివిల్లులు నాతో నడిచే
నువు నా జతలో నిలుచుంటే అవి నాకలుసే
హే... పువ్వా పువ్వా పువ్వా పువ్వా సిగపువ్వా
హే మువ్వ మువ్వ మువ్వ మువ్వ సిరిమువ్వ
హే... అలుండని సముద్రమే లేదు
తపించని తనువిక చేదు
గతించిన క్షణం ఇక రాదు రారాదు
సరేనని వరించని పొద్దు
సుఖాలకే విధించకే హద్దు
ప్రతిక్షణం పంచేసుకో నాతో నీ ముద్దు॥

చిత్రం : పూలరంగడు (1967)
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల


పల్లవి :
నీవు రావు నిదురరాదు...
నీవు రావు నిదురరాదు నిలిచిపోయె ఈ రేయి
నీవు రావు నిదురరాదు...

చరణం : 1
తారా జాబిలి ఒకటై సరసమాడె ఆ రేయి (2)
చింత చీకటి ఒకటై చిన్నబోయె ఈ రేయి ॥
చరణం : 2
ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే ఆశలు మదిలో విరిసె దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ...
ఆలయాన చేరి చూడ స్వామికానరాడయె
నా స్వామికానరాడయె

చరణం : 3
కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే (2)
ఎదురుచూసి ఎదురుచూసి (2)
కన్నుదోయి అలసిపోయె ॥

22 July - నేడు దాశరథి జయంతి

చిత్రం : పెళ్లిసందడి (1996)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, చిత్ర, బృందం


పల్లవి :
సౌందర్యలహరి... సౌందర్యలహరి...
సౌందర్యలహరి స్వప్నసుందరి
నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురీ
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి ॥

చరణం : 1
పాల చెక్కిళ్లూ జుజుజుజు జుజుజుజు
దీపాల పుక్కిళ్లూ జుజుజుజు జుజుజుజు
పాల చెక్కిళ్లూ పాల పుక్కిళ్లూ
అదిరేటి అధరాలు హరివిల్లులా
ఫక్కున చిందిన నవ్వులలో ఆ...
లెక్కకు అందని రతనాలు ఆ...
యతికైన మతిపోయే ప్రతిభంగిమా
ఎదలోనె పురివిప్పి ఆడింది వయ్యారి


చరణం : 2
నీలికన్నుల్లూ జుజుజుజు జుజుజుజు
నా పాలి సంకెళ్లూ జుజుజుజు జుజుజుజు
నీలికన్నుల్లూ నా పాలి సంకెళ్లూ
నను చూసి వలవేసి మెలివెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు ఆ....
శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ...
కలగంటి తెలుగింటి కలకంఠినీ
కొలువుంటె చాలంట నాకంట సుకుమారి ॥