Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
తారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి
ఒక పాట పాడాలి (2)

చరణం : 1
ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా
కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా

నిలిచి పొమ్మనీ మబ్బుగా
కురిసి పొమ్మనీ వానగా
విరిసి పొమ్మనీ వెన్నెలగా
మిగిలి పొమ్మనీ నా గుండెగా (2)
॥॥
చరణం : 2
నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా

చెప్పి పొమ్మనీ మాటగా
చేసి పొమ్మనీ బాసగా
చూపి పొమ్మనీ బాటగా
ఇచ్చి పొమ్మనీ ముద్దుగా (2)
॥॥

చిత్రం : ప్రేమాభిషేక ం (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు

పల్లవి :
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగినేల
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని

చరణం : 1
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిర ణంలా మా ముందు నువ్వుంటే
ప్రతిపూట దీపావళి
మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెల...
మా ఆశలే నీ అందెలై
ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై
ప్రేమించు ప్రాణం పాడే వేళ ॥
తొలకరి మేఘానివై రా కళ్యాణి


చరణం : 2
నడియాడే నీ పాదం నటవేదమేనంటూ
ఈ పుడమే పులకించగా
నీ పెదవి తనకోసం మనువైన కొలువంటూ
సంగీతం నినుచేరగా
మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో వేగే వేళ
నీ మేనిలో హరివిల్లులే వర్ణాలవాగై సాగే వేళ


చిత్రం : చంద్రలేఖ (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : సందీప్ చౌతా
గానం : రాజేష్, సుజాత

చిత్రం : ఆత్మగౌరవం (1966)
రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు॥

చరణం : 1
కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు ॥
వేషమైన మోసమైన అంతా నీకోసం...
ఊహూ అలాగ ॥

చరణం : 2
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది
పాపం ॥
గుండెమీద వాలిచూడు గోడువింటావు
ఆ! అబ్బబ్బబ్బా...॥

చరణం : 3
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో! ॥
కరుణచూపు కరుగకున్నా టాటా చీరియో
టాటా చీరియో... ॥
Raanani Ralenani - Athma Gouravam - ANR,Kanchana - Ghantasala,Suseela