Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : మహాత్మ (2009)
సంగీతం : విజయ్ ఆంటోని
రచన, గానం : కాసర్ల శ్యామ్, బృందం


పల్లవి :
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిలుసుంటే కృష్ణవేణి
నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే
నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కల్గెనమ్మా ఏదో కోరిక ॥

చరణం : 1
నల్లనల్లాని నీ కురులు దువ్వి... ఆహా...
తెల్లతెల్లాని మల్లెలు తురిమి... ఓహో...
చేమంతి పూలు పెట్టుకోని... ఆహా...
నీ పెయ్యంతా సెంటు పూసుకోని... ఓహో...
ఒళ్లంతా తిప్పుకుంటూ వయ్యారంగా
పోతూ ఉంటే నిలవదాయే నా ప్రాణమే ॥

చరణం : 2
నీ చూపుల్లో ఉంది మత్తు సూది... ఆహా...
నా గుండెల్లో గుచ్చుకున్నాది... ఓహో...
నీ మాటల్లో తుపాకి తూటా... ఆహా...
అబ్బ జారిపోయెనమ్మ నీ పైట... ఓహో...
నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి
ఒక్కసారి తిరిగి చూడవే ॥

Photo:కాసర్ల శ్యామ్

చిత్రం : వంశీ (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్‌నారాయణ్, సుజాత


పల్లవి :
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో
కన్నె బొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో
కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక
ఈడు పంచి ఊరడించరాదా
గోరువెచ్చగ గోలరెచ్చెగ
జోడుకట్టి జోలకొట్టరాదా
అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధ


చరణం : 1
సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే
కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ
బెదిరితే కథ కదలదే
అని త హతహ తరుముతు ఉన్నదీ
ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే


చరణం : 2
లెక్క చేయమాకు నువ్వు
సిగ్గులెంత బుగ్గనొక్కినా
పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా
అడగనా ఒక బహుమతి
నువు ఛీ పాడు అనకుంటే
అడగద్దు ఎవరనుమతి
చెలి తడితడి పెదవులు అందితే
కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే ॥

09 August - నేడు మహేష్‌బాబు బర్త్‌డే

చిత్రం : ప్రేమతో...రా! (2001)
రచన : చంద్రబోస్, సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత


సాకీ :
కనిపించావే తారలా
కరుణించావే దేవిలా
వరమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా

పల్లవి :
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగలా నవ్వింది ప్రేమ
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి ముద్దర వే సే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా


చరణం : 1
నీ రాకతో శశిరేఖతో
నా కంటిపాపలో వెలుగొచ్చింది
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది
నీ చెలిమితో చిరుజల్లుతో
నా పూల కొమ్మలో చిగురొచ్చింది
నీ జోడితో చిరువేడితో
జడలో మెడలో ఒడిలో కులుకొచ్చింది
హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట
ఈ రామయ్యే పాడేది ఏకపదంటా
గోపెమ్మే చెప్పింది గుట్టు కథంతా
మరి చిలకమ్మే చెప్పేది గొప్ప కథంటా


చరణం : 2
నీ లాలితో లాలింపులో
ఇన్నాళ్ల వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కౌగిళ్లతో
కలలో ఇలలో కనని కలిమొచ్చింది
నీ చేతితో చేయూతతో
ఇన్నేళ్ల సొగసులో సెగలొచ్చింది
నీ ఆటతో సయ్యాటతో
అచటో ఇచటో ఎచటో హాయొచ్చింది
హరే కృష్ణయ్య దోచాడు కన్నె ధనాన్నే
మరి రామయ్యే కోరాడు ప్రేమ వరాన్నే
అలా రాధమ్మే కొసరింది కలికితనాన్నే
ఇలా ఈ గుమ్మే నడిపింది వలపు రథాన్నే ॥

Photo : మణిశర్మ