Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : తీన్‌మార్ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి, సంగీతం :మణిశర్మ
గానం : హేమచంద్ర, శ్రీవర్ధిని, బృందం


పల్లవి :
జై బోలో
శంకర మహారాజ్‌కీ
బోలో కాశీవిశ్వనాథ్‌కి
హర హర హర హర మహదేవ్ ॥బోలో॥
శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా
జై బోలో శంకర మహారాజ్‌కి
హర హర మహాదేవ్
జగమేలు శివశంకరా...
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా ॥

చరణం : 1
నిప్పు నీరు రెంటినీ...
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ ॥బోలో॥॥
సనిపని సరి సనిపని సరి మపనిసా (2)
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి (2)
సరిసని దనిపమ గమనిప మగరినిసా (2)

చరణం : 2
ఆరాధించే తొందర...
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ ॥బోలో॥॥

చిత్రం : ప్రేమికుడు (1995)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : షాహుల్ హమీద్, రెహమాన్, సురేష్ పీటర్


పల్లవి :
ఊర్వశీ ఊర్వశీ
డటేకిటీజీ ఊర్వశీ
వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ ॥
గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ॥
ఓ చెలి తెలుసా తెలుసా
తెలుగు మాటలు పదివేలు
అందులో ఒకటో రెండో
పలుకు నాతో అది చాలు॥

చరణం : 1
చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ ॥
ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో ॥

చరణం : 2
చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనిత కు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది
సీతకు విగ్రహమే లేదే
పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే
టేకిటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ ॥॥
పగలు నిన్ను చూడని కన్నెలకు
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్ఛయే నీకు లేనప్పుడు
స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా
క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు
అరవైలో చేస్తే ఏం లాభం

Photo:ఎ.ఆర్.రెహమాన్

చిత్రం : చంటబ్బాయ్ (1986)
రచన : వేటూరి
సంగీతం : చక్రవ ర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
నేను నీకై పుట్టినాననీ
నిన్ను పొందక మట్టికాననీ
చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలూ ఊసులే ప్రేమ
ఊపిరే ప్రేమ...

చరణం : 1
నిన్నుచూడక నిదరపోనీ రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే మౌనమంత్రాలు
నిన్నుతాకక నిలవలేని పంచప్రాణాలు
కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుపతరమా
ప్రేమే జీవన మధురిమ ॥

చరణం : 2
శ్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడ ల్లే నీదు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
నాదమై నిన్నాలపించే ప్రణవమై ఉంటా
ప్రేమ మధుమ తెలియ తరమా
ప్రేమే జీవన మధురిమ ॥

22 August : నేడు చిరంజీవి బర్త్‌డే