Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సంబరం (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం, గానం : ఆర్.పి.పట్నాయక్

పల్లవి : ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
వెంటాడుతు వేధించాలా
మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా ॥

చరణం : 1
తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా
గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి ॥

చరణం : 2
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా ॥

చిత్రం : ప్రేమించు (2001)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
గానం : ఎస్.పి.బాలు, చిత్ర


పల్లవి :
కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
చరణం : 1
కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లయిన తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥
చరణం : 2
ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవశించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా

చిత్రం : బద్రి (2000)
రచన : వేటూరి, సంగీతం : రమణ గోగుల
గానం : రమణ గోగుల, సునీత


పల్లవి :
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

చరణం : 1
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన
తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

చరణం : 2
నీ హృదయాల ప్రణయమనే ప్రాణ ంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల ॥