Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : లవకుశ (lavakuSa) (1963)
రచన : కొసరాజు (kosarAju)
సంగీతం, గానం : ఘంటసాల (ghanTasAla)
ఘంటసాల స్పెషల్ ((ghanTasAla Special)


పల్లవి :
ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఎవరూహించెదరూ॥నిమిషానికి॥
విధివిధానమును తప్పించుటకై
ఎవరు సాహసించెదరూ...॥నిమిషానికి॥
చరణం : 1
కంచెయే నిజముగా
చేను మేసినా కాదనువారెవరూ
రాజే ఇది శాసనమని పల్కిన
ప్రతిఘటించువారెవరూ॥నిమిషానికి॥
రణం : 2
కరుణామయులిది కాదనలేరా
కఠిన కార్యమనబోరా
సాధ్వులకెపుడూ వెతలేనా
తీరని దుఃఖపు కథలేనా॥నిమిషానికి॥
చరణం : 3
ఇనకులమున
జనియించిన నృపతులు
ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి
విడ్డూరముగా చూచెదరా॥నిమిషానికి॥
చరణం : 4
ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి
ఎందుకు ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే
దైవ చిద్విలాసాలు॥నిమిషానికి॥
చరణం : 5
అగ్నిపరీక్షకే నిల్చిన సాధ్విని
అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయే జనవాక్యమ్మని
అల్పుని మాటయే జనవాక్యమ్మని
అనుసరించుటే ధర్మమా...॥నిమిషానికి॥

రచన : రావులపర్తి భద్రిరాజు(rAvulaparti bhadrirAju)
సంగీతం, గానం : ఘంటసాల (ghanTasAla)
ఘంటసాల స్పెషల్ (ghanTasAla special)


పల్లవి :
నమో వెంకటేశా...
నమో తిరుమలేశా...
నమస్తే నమస్తే నమః... ఆ...॥వెంకటేశా॥
మహానందమాయే ఓ మహాదేవదేవ
మహానందమాయే ఓ మహాదేవదేవ ॥వెంకటేశా॥
చరణం : 1
ముడుపులు నీకొసగి
మా మొక్కులు తీర్చుమయా (2)
ముక్తికోరి వచ్చే
నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా...॥వెంకటేశా॥
చరణం : 2
నరక తుల్యమౌ
ఈ భువి స్వర్గము చేయవయా (2)
మనుజులు నిను చేరే
పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా...॥వెంకటేశా॥
పల్లవి :
ఏడుకొండలవాడా
వెంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండలసామీ
ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా
కానారావేమయ్యా ఆ...
ఏడుకొండలసామీ... (2)
చరణం : 1
ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
మనుషులకు దూరంగా
మసలుతున్నావా (2)
ఏడుకొండలసామీ... (2)
చరణం : 2
ఏచోట గాంచినా నీవుందువందురే
ఏమిటో నీ మాయ
తెలియకున్నామయ్యా॥
ఈ అడవి దారిలో చేయూతనీయవా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవా ॥

చిత్రం : అల్లరి ప్రియుడు (allari priyuDu) (1993)
రచన : వేటూరి (vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి (M. M. keeravaNi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర (S.P.bAlu, chitra)
04 Februarth - నేడు రాజశేఖర్ బర్త్‌డే



పల్లవి :
ఉత్తరాల ఊర్వశి
ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల
హారతివ్వగా
హలా హలా అదెంత
వే డి వెన్నెల
ముఖాముఖి
ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనుల విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు
మాకు మాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ
చరణం : 1
పువ్వులెన్నో విచ్చినట్టుగా
చెలీ నవ్వగానే నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా
ప్రియా చూసుకోరా పట్టి కౌగిలి
ఖవ్వాలీల కన్నులతోనే
జవానీల జాబులు రాసి
జగడమొకటి సాగిందోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి
వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దొరసోకు తోరణాలు
కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద
హంసలేఖ రాసిన॥
చరణం : 2
సమ్ముఖాన
రాయబారమా
సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా
అదే అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నో
కవ్విస్తుంటే హృదయమొకటి
పుట్టిందోయమ్మా
సరాగాల సంపెంగల్లో పరాగాల
పండిస్తుంటే పరువమొకటి
వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద
పొన్నతోట తుమ్మెదాడి
జుంటి తేనెమత్తులోన
కొంటె వేణువూదినా॥॥
Download Song:
vuttarAla oorvasi - ఉత్తరాల ఊర్వశి