Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Ramanand Sagar's Ramayan: Ramayan - Episode 1- UTV Devotional



Ramayan Episode 1- UTV Devotional

The story of God Ram, Sita, Laxman, Hanuman and the Might Ravana Begins with the legendary Ashok Kumar introducing the beginnings of Ramayana. Giving an in-dept understanding of how this great saga has shaped human history and culture from the dawn of civilization.
So thus begins the story of Good vs Evil

Ramanand Sagar's Ramayan



The story of God Ram, Sita, Laxman, Hanuman and the Might Ravana Begins with the legendary Ashok Kumar introducing the beginnings of Ramayana. Giving an in-dept understanding of how this great saga has shaped human history and culture from the dawn of civilization.
So thus begins the story of Good vs Evil

చిత్రం : శ్రీరామరాజ్యం(SrI rAma rAjyam) (2012)
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(jonnavittula)
సంగీతం : ఇళయరాజా(iLayarAja)
గానం : కె.ఎస్.చిత్ర, శ్రేయా ఘోషల్(K.S.chitra,SrEyA ghoshan)


పల్లవి :
దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి
మనసంతా వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
'దేవుళ్లే'
చరణం : 1
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలు
నలుగురు
రఘువంశమే వెలిగే
ఇల ముదమందిరి జనులే
'దేవుళ్లే'
చరణం : 2
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ
రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని
ఆ ముని మిథిలాపురికేగే
శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగా సాగునింక జానకి అని
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కలిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
'దేవుళ్లే'